పాముకాటుతో రైతు మృతి.. మహబూబాబాద్ జిల్లాలో ఘటన

పాముకాటుతో రైతు మృతి.. మహబూబాబాద్ జిల్లాలో ఘటన

కొత్తగూడ,వెలుగు: మహబూబాబాద్​ జిల్లా కొత్తగూడ మండలం పోలారం తండాకు చెందిన బానోత్​ చక్రు(45) పాముకాటుతో చనిపోయాడు. గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం ఉదయం తన పొలం వద్దకు వెళ్లి పనులు చేస్తుండగా కాలిపై తాచుపాము కాటు వేసింది. దీంతో పక్కనే ఉన్న రైతులకు విషయం చెప్పాడు. వారు ఆయనను హాస్పిటల్​కు  తరలిస్తుండగా, మార్గమధ్యలో చనిపోయాడు. మృతుడికి భార్య లక్ష్మితో పాటు ముగ్గురు కొడుకులు ఉన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాజ్​ కుమార్  తెలిపారు.