పాము కరిస్తే.. చికిత్స కోసం 13 వందల కిలోమీటర్లు వెళ్లాడు..

పాము కరిస్తే.. చికిత్స కోసం 13 వందల కిలోమీటర్లు వెళ్లాడు..

గుజరాత్ రాజ్ కోట్ లో ఫతేపూర్ కు చెందిన  సునీల్ కుమార్ (21) కూలీ పనులు చేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు.  ఆగస్టు 15న సునీల్ కూలి పని చేస్తుండగా పాము కాటు వేసింది. ఇక అంతే ఆయన పరిస్థితి విషమించడంతో దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు.  ప్రాథమిక చికిత్స అనంతరం  మెరుగైన వైద్యం కోసం ఉత్తర ప్రదేశ్ కాన్పూర్‌లోని లాలా లజపత్ రాయ్ ఆసుపత్రికి తీసుకెళ్లాలనిసునీల్ కుటుంబసభ్యులు  నిర్ణయించుకున్నారు. రాజ్ కోట్ నుంచి  కాన్పూర్‌ కు 1300 కిలోమీటర్ల దూరం ఉంటుంది.   అడ్వాన్స్‌డ్ లైఫ్ సపోర్ట్ (ALS) అంబులెన్స్‌లో అక్కడకు తీసుకెళ్లినందుకు  51 వేలు ఖర్చు అయ్యాయి. 

కాన్సూర్ లోని ఎల్‌ఎల్‌ఆర్‌  ఆస్పత్రికి తీసుకెళ్లే సమయానికి సునీల్ స్పృహలో లేడు.  వెంటనే ఎమర్జన్సీ చికిత్సలో భాగంగా   వెంటిలేటర్ పైఉంచారు.   రెండు రోజులు చికిత్స అనంతరం ఆగస్టు 17న  సునీల్ స్పృహ లోకి వచ్చాడని ల్‌ఎల్‌ఆర్ సీనియర్ వైద్యుడు డాక్టర్ బిపి ప్రియదర్శి తెలిపారు. ఆస్పత్రికి వచ్చే సమయానికి సునీల్ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.  పాము విషం శరీరం అంతటా వ్యాపించిదన్నారు.  అతని యాంటీవెనమ్, ఇతర మందులు ఇచ్చి చికిత్స చేశారు.  ప్రస్తుతం సునీల్ పరిస్థితి మెరుగుపడటంతో అతనికి వెంటిలేటర్ తొలగించి ఐసీయూ వార్డుకు తరలించారు.    సునీల్ ఉత్తరప్రదేశ్ ఫతేపూర్ జిల్లాలోని కిషన్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రారీ గ్రామానికి చెందినవాడు.  అయితే ఆయన జీవనోపాధినిమిత్తం రాజ్ కోట్ లో పనిచేస్తున్నాడు.
 .