భగభగ మండుతున్న కేరళ

భగభగ మండుతున్న కేరళ

ఇంకా ఎండాకాలం మొదలే కాలేదు. అప్పుడు భానుడు భగభగ మండుతున్నాడు. రోజు వారీ ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఇప్పుడే ఇలా ఉండే ఇక మే నెలలో పరిస్థితి ఏంటని ఆందోళనలు  మొదలయ్యాయి. దేశవ్యాప్తంగా రోజువారీ ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కూడా డైలీ టెంపరేచర్ పెరుగుతోంది.కేరళలో ఎండలు భగభగ మండుతున్నాయి. కేరళలో రోజు వారీ ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరుగుతున్నాయని ప్రమాదాల పట్ల అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ఆరోగ్యశాఖ పౌరులను హెచ్చరించింది. కేరళ రాష్ట్ర విపత్తు నిర్వహన అథారిటీ (KSDMA) హెచ్చరికలు , చిట్కాలను జారీ చేసింది. 

ఎండ తీవ్రత నుంచి కాపాడుకోవాలంటే.. 

  • ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల మద్య ఎండలో తిరగకూడదు. 
  • శుభ్రమైన నీరు పుష్కలంగా తాగాలి. దాహం అనిపించకపోయినా హైడ్రేటెడ్ గా ఉండటం కోసం తాగాలి. 
  • పగటిపూట ఆల్కహాల్, కాఫీ, కార్బోనేటెడ్ శీతల పానియాలు ఇలాంటి పానియాలు తీసుకోవడం మానుకోవాలి. 
  • వదులుగా ఉండే కాటన్ వస్త్రాలు ధరించండి. 
  • బయట అడుగు పెట్టేటప్పుడు చెప్పులు, తలకు టోపి, గొడుగు ఉపయోగించడం మంచిది. 
  • మీ ఆహారంలో వివిధ రకాల పండ్లు , కూరగాయలను చేర్చుకోవాలి 
  • మార్కెట్లు, నిర్మాణ స్థలాలు, డంప్ యార్డులు వంటి ప్రాంతాల్లో అగ్ని ప్రమాదాన్ని నివారించేందుకు వ్యర్థాలను తొలగించాలి. 
  • ఉదయం 11 గంటల నుంచి మద్యాహ్నం 3 గంటల వరకు పనిచేసే మీడియా నిపుణులు, పోలీస్ అధికారులు వేడి వేడికి గురికాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.