ప్రస్తుతం తెలుగు ప్రముఖ హీరోయిన్ శోభిత ధూళిపాళ లవ్, సితార అనే చిత్రంలో మెయిన్ లీడ్ పాత్రలో నటిస్తోంది. ఈ చిత్రానికి బాలీవుడ్ ప్రముఖ దర్శకురాలు వందన కటారియా దర్శకత్వం వహించగా రాజీవ్ సిద్ధార్థ, శంకర్ ఇందుచూడన్, సీమ శర్మ తదితరులు ప్రధాన తారాగణంగా నటించారు. కాగా ఈ చిత్రాన్ని బాలీవుడ్ ప్రముఖ సినీ నిర్మాత రోనీ స్క్రూవాలా నిర్మించారు.
లవ్ ఎమోషనల్ ఓరియెంటెడ్ తరహాలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని నేరుగా ఓటీటీలో విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ సభ్యులు అధికారికంగా తెలిపారు. ఇందులో భాగంగా ఈ నెల 27 నుంచి జీ 5లో లవ్, సితార చిత్రం స్ట్రీమింగ్ కానున్నట్లు చిత్ర యూనిట్ పేర్కొంది.
ALSO READ | కెరీర్ లోనే ఫస్ట్ టైం... ఆ బాలీవుడ్ స్టార్ తో జతకట్టనున్న కాజల్ అగర్వాల్..
ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం నటి శోభిత ధూళిపాళ వరుస సినిమాల్లో నటిస్తోంది. అలాగే ఇటీవలే టాలీవుడ్ ప్రముఖ హీరో అక్కినేని నాగచైతన్యతో శోభిత ధూళిపాళకి ఎంగేజ్మెంట్ కాగా తొందర్లోనే పెళ్లి పీఠలు ఎక్కబోతోంది .
A tale of love, heartbreak, and self-discovery!
— ZEE5 (@ZEE5India) September 10, 2024
Watch #LoveSitara, premiering on 27th September, only on #ZEE5. #LoveSitaraOnZEE5 pic.twitter.com/zHGnSUmUmr