కెరీర్ లోనే ఫస్ట్ టైం... ఆ బాలీవుడ్ స్టార్ తో జతకట్టనున్న కాజల్ అగర్వాల్..

కెరీర్ లోనే ఫస్ట్ టైం...  ఆ బాలీవుడ్ స్టార్ తో జతకట్టనున్న కాజల్ అగర్వాల్..

టాలీవుడ్ లో ఒకప్పుడు వరుస స్టార్ హీరోల సరసన హీరోయిన్ గా నటించి మెప్పించిన ప్రముఖ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్  గురించి తెలుగు ప్రజలకి కొత్తగా తెలియజేయాల్సిన అవసరం లేదు. అయితే పెళ్లయిన తర్వాత నటి కాజల్ కొంతమేర సినిమాల పరంగా జోరు తగ్గించిందని చెప్పవచ్చు. ఈ క్రమంలో తాను నటించబోయే చిత్రాల కథల విషయంలో కూడా ఆచితూచి అడుగులు వేస్తోంది. 

అయితే తాజాగా నటి కాజల్ బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ మరియు ప్రముఖ డైరెక్టర్ ఏఆర్ మురగదాస్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సికిందర్ అనే చిత్రంలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. కాగా ఇప్పటివరకూ కాజల్ అగర్వాల్ ఒకసారి కూడా సల్మాన్ ఖాన్ తో కలసి నటించలేదు. దీంతో ఈ చిత్రంపై కొంతమేర ఆసక్తి నెలకొంది. 

ALSO READ | బాలీవుడ్ బ్యూటీతో దేవర ప్రమోషన్స్ షురూ చేసిన తారక్...

ఈ విషయం ఇలా ఉండగా సికిందర్ చిత్రంలో సల్మాన్ ఖాన్ కి జోడిగా రష్మిక మందన్ననటిస్తుండగా తమిళ నటుడు సత్యరాజ్, ప్రతీక్ పాటిల్ బబ్బర్, తదితరులు ప్రధాన తారాగణంగా నటిస్తున్నారు. బాలీవుడ్ ప్రముఖ సినీ నిర్మాత సాజిద్ నడియాద్వాలా నిర్మిస్తున్నాడు.కాగా ఈ చిత్రం వచ్చే ఏడాదిలో విడుదల కానున్నట్లు సమాచారం.