
పాకిస్తానీ సెలబ్రిటీల సోషల్ మీడియా ఖాతాలు భారత్లో కనిపించడంతో తీవ్ర విమర్శలు వచ్చాయి. బుధవారం (జూన్2) పాకిస్తానీ నటులు హనియా అమీర్, మహిరా ఖాన్, సబా కమర్ ,మావ్రా హొకేన్ వంటి అనేక మంది పాకిస్తానీ నటుల ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్స్ బుధవారం భారత్ లో కనిపించడం ఆన్‌లైన్‌లో తీవ్రవిమర్శలకు దారితీసింది.దీంతో కేంద్ర ప్రభుత్వం పాకిస్తానీ సెలబ్రిటీల ప్రొఫైల్స్ ను మరోసారి బ్యాన్ చేసింది.
ఆపరేషన్ సింధూర్ తర్వాతపాకిస్తానీ సెలబ్రిటీ సోషల్ మీడియా అకౌంట్లను కేంద్రం నిషేధించినవిషయం తెలిసిందే..ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా భారత సైన్యం పాకిస్తాన్,పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్రవాద స్థావరాలు లక్ష్యంగా దాడులు చేసింది. భారత సైనిక చర్యపై పాకిస్తానీ సెలబ్రిటీలు బహిరంగ విమర్శలు చేశారు. దీంతో హనియా అమీర్‌తో సహా అనేక మంది పాకిస్తాన్ గాయకులు, నటులపై తమ భారతీయులనుంచి తీవ్ర విమర్శలు ఎదురయ్యాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం పాకిస్తానీ సెలబ్రిటీల సోషల్ మీడియా ఖాతాలను బ్యాన్ చేసింది.
పహల్గాం దాడి తర్వాత మరోసారి పాకిస్తానీ నటులను భారతీయ చిత్రాల నుండి నిషేధించారు. అయితే అప్పటికే హనియా అమీర్ దిల్జిత్ దోసాంజ్ నటించిన పంజాబీ చిత్రం సర్దార్ జీ 3 కోసం నటించారు. మేలో ఈ సినిమా ట్రైలర్ విడుదలైన వెంటనే, సర్దార్ జీ 3 నటీనటులు.నిర్మాతలు ఎదురుదెబ్బలు ఎదుర్కొన్నారు. నాటకీయ పరిణామాల మధ్య చిత్ర నిర్మాతలు తమ చిత్రాన్ని విదేశీ థియేటర్లలో విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు.భారతీయ మనోభావాలకు అనుకూలంగా భారత్ లో ఈ సినిమా విడుదలను నిషేధించారు. ప్రముఖులు.
అయితే సోషల్ మీడియాలో దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. హనియాను ఎంపిక చేసినందుకు నిర్మాతలు ,దిల్జిత్‌ను విమర్శించగా..మరికొందరు మద్దతు తెలిపారు. సినిమా చిత్రీకరించినప్పుడు, భారత్ , పాకిస్తాన్ మధ్య సంబంధం సాధారణంగా ఉందని చెప్పారు. ఈ చిత్రం పాకిస్తాన్‌లో విడుదలైంది .బాగా ఆడుతోంది. సర్దార్ జీ 3 ఓవర్సీస్ కలెక్షన్లు కూడా బాగున్నాయి.
బుధవారం పాకిస్తానీ సెలబ్రిటీల సోషల్ మీడియా ఖాతాలు భారత్లో కనిపించడంతో తీవ్ర విమర్శలు వచ్చాయి. హనియా అమీర్, మహిరా ఖాన్, సబా కమర్ ,మావ్రా హొకేన్ వంటి పాకిస్తానీ నటుల ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్స్ ఆన్‌లైన్‌లో కనిపించడంతో తీవ్రవిమర్శలకు దారితీసి కేంద్ర ప్రభుత్వం పాకిస్తానీ సెలబ్రిటీల ప్రొఫైల్స్ ను మరోసారి బ్యాన్ చేసింది.