Chilli Chai : పెళ్లికాని అమ్మాయిలకు.. స్పెషల్ చాయ్ రెసిపీ

Chilli Chai : పెళ్లికాని అమ్మాయిలకు.. స్పెషల్ చాయ్ రెసిపీ

భారత్ లో చాయ్ (టీ)కి చాలా ప్రత్యేకత ఉంటుంది. ఎవరైనా అతిథులు ఇంటికి వచ్చినా, ఫ్రెండ్స్ తో బయటికి వెళ్లినా, ఔట్ డోర్ మీటింగ్స్ జరిగినా  చాయ్ ఆఫర్ చేయాల్సిందే. అంతెందుకు స్ట్రెస్ ఫీల్ అయినా ఒక కప్పు టీ తాగాల్సిందే. అయితే, మామూలుగా టీని తేయాకులతో (టీ పౌడర్) చేస్తుంటాం. ఇప్పుడు ట్రెండ్ మారింది. దీంతో రకరకాల ప్లేవర్స్ లో దొరుకుతున్నాయి. టీ లవర్స్ అంతా వాటిని టేస్ట్ చేసి ఉంటారు. కానీ, సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న ఈ టీ మాత్రం తాగటం సరి కదా.. కనీసం చూసి కూడా ఉండరు. అదే చిల్లీ టీ. అంటే.. పండు మిరపకాయలతో టీ చేయడం అన్నమాట.

ఈ టీ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. భావన అరోరా అనే ట్విట్టర్ అకౌంట్ నుంచి పోస్ట్ అయిన ఈ చాయ్ వీడియోలో.. పాలల్లో పండు మిరపకాయలు వేసి మరగబెడుతుంటారు. ఎర్రగా అయిన పాలను కప్పులో పోసి సర్వ్ చేస్తారు. ఈ వీడియోకు క్యాప్షన్ గా.. ‘అమ్మాయిలూ ఇది మీ కోసమే. పెళ్లి ఎప్పుడు అని విసిగించే ఆంటీలకు సైలెంట్ గా ఈ చాయ్ ప్రిపేర్ చేసి ఇవ్వండి. అంతే మళ్లీ వాళ్లు మీ జోలికి రారు’ అంటూ రాసింది.

ఈ వీడియోని ఇప్పటివరకు ఐదున్నర లక్షల మంది చూశారు. 3వేల లైక్స్ వచ్చాయి. అయితే, వీడియోకి కామెంట్ గా.. చాలా గొప్ప ఆలోచన, పగ తీర్చుకునేందుకు మంచి ప్లాన్ ఇది అంటూ ఫన్నీ కామెంట్స్ పెడుతున్నారు.

చిల్లీ చాయ్ ఎలా తయారు చేస్తారో కింద వీడియోలో ఉంది.. మీరు ఓసారి ట్రై చేసి చెప్పండీ.. బాగుంటే మీరు తాగండి.. కసి తీర్చుకోవాలంటే ఇంకొకరికి ఇవ్వండీ..