మార్కెట్లోకి  సోడియం అయాన్ బ్యాటరీస్

మార్కెట్లోకి  సోడియం అయాన్ బ్యాటరీస్

హైదరాబాద్: బ్యాటరీల తయారీ సంస్థ సోడియన్​ ఎనర్జీ తన సోడియం అయాన్ బ్యాటరీలను బుధవారం ఆవిష్కరించింది. ఇండియాలో మొట్టమొదటిసారిగా ఈ రకం బ్యాటరీని తామే తయారు​ చేసినట్టు ప్రకటించింది. యూపీఎస్​, స్టార్టర్ బ్యాటరీలు,  బ్యాటరీ ప్యాక్‌‌లతో సహా దాని సోడియం అయాన్ బ్యాటరీలను ఉపయోగించి కంపెనీ పలు అప్లికేషన్లను కూడా పరిచయం చేసింది.

సోడియన్ ఎనర్జీ కో–ఫౌండర్​ బాల పచ్చయప్ప మాట్లాడుతూ సాధారణ బ్యాటరీలతో పోలిస్తే వీటి మన్నిక, నిల్వ సామర్థ్యం ఎక్కువని, ధరలు తక్కువని చెప్పారు.   అగ్ని ప్రమాదాలను తట్టుకుంటాయని వివరించారు.