శ్రీశైలం ఆలయ సమీపంలో యువతి ఆత్మహత్య

శ్రీశైలం ఆలయ సమీపంలో యువతి ఆత్మహత్య

శ్రీశైలంలో హైదరాబాద్ యువతి ఆత్మహత్యకు పాల్పడింది.  మౌనిక అనే సాఫ్ట్ వేర్ ఉద్యోగి శ్రీశైలం ప్రధాన ఆలయానికి సమీపంలో విషం తీసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. అయితే ఆమెను వెంటనే 108 వాహనంలో సున్నిపెంట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే ఆమె అప్పటికే మృతి చెందింది. మౌనిక ఆత్మహత్యకు భర్త వేధింపులే కారణమని తెలుస్తోంది. భర్త అభిలాష్ పై రెండు నెలల క్రితం మౌనిక సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. అదనపు కట్నం కోసం వేధిస్తున్నానడి తన ఫిర్యాదులో పేర్కొంది. అయితే శ్రీశైలం వచ్చే ముందు కూడా మౌనిక అభిలాష్ తో మాట్లాడినట్లు తెలుస్తోంది. శ్రీశైలం వెళ్తున్న విషయం అతనికి చెప్పినట్లు సమాచారం.