మ్యాన్ హోల్లో పడి గల్లంతైన వ్యక్తి డెడ్ బాడీ లభ్యం

మ్యాన్ హోల్లో పడి గల్లంతైన వ్యక్తి డెడ్ బాడీ లభ్యం


హైదరాబాద్ : రెండు రోజుల కింద మ్యాన్ హోల్లో పడి గల్లంతైన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ డెడ్ బాడీ కనిపించింది. మణికొండలో గల్లంతైన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతదేహం సోమవారం లభ్యమైంది. నేక్నమ్ పూర్ చెరువులో డెడ్ బాడీ దొరికిందని తెలిపారు పోలీసులు. గత శనివారం రాత్రి మనికొండ గోల్డెన్ టెంపుల్ వద్ద సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మ్యాన్ హాల్లో పడి గల్లంతైన విషయం తెలిసిందే. రెండు రోజులుగా ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టగా సోమవారం మృతదేహాన్ని గుర్తించి వెలికి తీశారు. గల్లంతైన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఆచూకీ కోసం 10 బృందాలతో రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.