
హైదరాబాద్: కరెంట్ తీగపై పడిన ప్యాంట్ తీసుకోబోయి విద్యుత్ షాక్‌తో ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ మృతి చెందాడు. చాదర్‌ఘాట్ పరిధిలోని దయానంద నగర్ సిరి నిలయం అపార్ట్ మెంట్‌లో నివాసముంటున్న సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ప్రవీణ్ గౌడ్ ప్రమాదవశాత్తూ కరెంట్ షాక్‌తో చనిపోయాడు. వర్షం కురుస్తున్న సమయంలో ఉతికిన బట్టలు తీస్తుండగా.. తడిసిన ప్యాంట్ కరెంట్ తీగలపై పడింది. ఆ ప్యాంట్‌ను తీసుకునేందుకు ప్రయత్నించి ప్రవీణ్ గౌడ్ షాక్ తగిలి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా హాస్పిటల్ కి తరలించారు.