KPHB కాలనీ 7th ఫేస్ లో దారుణం జరిగింది. సతీష్ అనే సాఫ్ట్ వేర్ ఉద్యోగి హత్య చేయబడ్డాడు. ప్రకాశం జిల్లా మార్టూరుకి చెందిన సతీష్…చిన్ననాటి స్నేహితుడు హేమంత్ తో కలిసి ఐటీ స్లెట్ సొల్యూషన్స్ కంపెనీ నడుపుతున్నాడు. మూడు రోజులుగా సతీష్ ఇంటికి రాకపోవడంతో.. భార్య ప్రశాంతి KPHB పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది. అయితే సతీష్ మృతదేహం బిజినెస్ పాట్నర్ హేమంత్ ఇంట్లో లభ్యమైంది.
