లోన్ రాలేదని సాఫ్ట్‌వేర్ ఎంప్లాయ్ సూసైడ్

లోన్ రాలేదని సాఫ్ట్‌వేర్ ఎంప్లాయ్ సూసైడ్

మేడ్చల్ జిల్లా అల్వాల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. బ్యాంక్ లోన్ అప్రూవ్ కాకపోవడంతో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీస్‌స్టేషన్ పరిధిలోని చైతన్య హౌసింగ్ కాలనీకి చెందిన శ్రీనివాస్ రెడ్డి సాఫ్ట్‌వేర్ ఉద్యోగి. ఆయన కొత్తగా ఇంటి నిర్మాణం చేపట్టాడు. అందుకోసం ఆయన బ్యాంకులో లోన్ కోసం అప్లై చేశాడు. కానీ బ్యాంక్ నుంచి లోన్ అప్రూవ్ కాలేదు. దాంతో ఇంటి నిర్మాణం మధ్యలోనే ఆగిపోతుందని శ్రీనివాస్ రెడ్డి తీవ్ర కలత చెందాడు. డబ్బులు లేకుండా నిర్మాణం ఎలా చేపట్టాలో తెలియక.. ఇంట్లోనే ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. భార్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు.. మృతదేహాన్ని గాంధీ హాస్పిటల్‌కు తరలించారు.