బస్సు ఎక్కే హడావుడిలో రివాల్వార్ మర్చిపోయిండు

బస్సు ఎక్కే హడావుడిలో రివాల్వార్ మర్చిపోయిండు

సంగారెడ్డి జిల్లా: జహీరాబాద్ ఆర్టీసీ బస్టాండ్ లో టాయిలెట్ కు వెళ్లిన సమయంలో సైనికుడు సికిందర్ అలీ రివాల్వర్ మర్చిపోయాడు. స్వగ్రామం సిర్గాపూర్ వెళ్లేందుకు జహీరాబాద్ లో నిజామాబాద్ బస్సు ఎక్కే హడావిడిలో రివాల్వర్ గురించి ఆలోచించలేదు. హడావుడిగా రివాల్వార్ లేకుండానే బస్సు ఎక్కేశాడు. కొద్దిసేపటికే అంటే బస్సు నారాయణఖేడ్ చేరుకున్నాక రివాల్వర్ పోగొట్టుకున్న విషయం గుర్తు చేసుకున్నాడు. వెంటనే జహీరాబాద్ బస్టాండుకు వెళ్లి విచారించినా రివాల్వార్ దొరకలేదు. దీంతో పోలీస్ స్టేషన్ కు వెళ్లి రివాల్వార్ పోగొట్టుకున్నట్లు సైనికుడు సికిందర్ అలీ ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.