నందమూరి హీరో సాలిడ్ ఎంట్రీ.. ఆసక్తి రేపుతున్న 'బ్రీత్’ టీజర్

నందమూరి హీరో సాలిడ్ ఎంట్రీ.. ఆసక్తి రేపుతున్న 'బ్రీత్’ టీజర్

నందమూరి ఫ్యామిలీ(Nandamuri Family) నుంచి మరో  హీరో రాబోతున్నారు. నందమూరి జయకృష్ణ(Jayakrishna) తనయుడు చైతన్య కృష్ణ(Chaitanya Krishna) హీరోగా 'బ్రీత్’(Breathe) అనే మూవీ తో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్నారు. తాజాగా బ్రీత్ మూవీ నుంచి టీజర్‌ను విడుదల చేశారు మేకర్స్. టీజర్ చూస్తుంటే ఈ మూవీ మెడికల్ మాఫియా నేపథ్యంగా థ్రిల్లర్ కథాంశంతో రాబోతున్నట్లు తెలుస్తోంది. డిఫరెంట్ ఎలిమెంట్స్ తో వస్తున్న ఈ మూవీ లో చైతన్య కృష్ణ రోల్ ఆకట్టుకుంటుందని మేకర్స్ తెలిపారు. ఈ మూవీ లో వెన్నెల కిశోర్(Vennela kishore) ముఖ్య పాత్రలో కనిపించనున్నాడు. ఇక నందమూరి ఫ్యామిలీ నుండి మరో హీరో రానుండటంతో ఫ్యాన్స్ తెగ ఖుషి అవుతున్నారు. 

ఈ మూవీని బసవతారకరామ ఆర్ట్స్(Basava Tarakarama Arts) పతాకంపై నందమూరి జయకృష్ణ నిర్మింస్తున్న ఈ చిత్రానికి.. వంశీకృష్ణ ఆకెళ్ల(Vamsi Krishna Akella) దర్శకత్వం వహిస్తున్నారు. దాదాపు షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా.. నిర్మాణాంతర కార్యక్రమాలు పూర్తి చేసుకొని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

ALSO READ:ఆకట్టుకుంటున్న కంగనా 'ఎమర్జెన్సీ' టీజర్