
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ స్టేట్ డెయిరీ డెవలప్‌మెంట్ కో ఆపరేటివ్ ఫెడరేషన్ చైర్మన్‌గా టీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ సోమ భరత్ కుమార్‌ను నియమిస్తూ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు సీఎస్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. రెండేండ్ల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలోని వర్ధమానుకోటకు చెందిన భరత్ టీఆర్‌ఎస్ ఆవిర్భావం నుంచి పార్టీలో పనిచేస్తున్నారు. వృత్తిరీత్యా అడ్వొకేట్ అయిన ఆయన పార్టీ లీగల్ టీంలో కీలకంగా పనిచేశారు. పార్టీ జనరల్ సెక్రటరీగా ఎలక్షన్ కమిషన్ వ్యవహారాలు పర్యవేక్షిస్తున్నారు. భరత్ సోమవారం ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఆయన చేతుల మీదుగా నియామకపత్రం అందుకున్నారు.