
హైదరాబాద్, వెలుగు: డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ (డీటీఎఫ్) రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా ఎం. సోమయ్య (నల్లగొండ), ప్రధాన కార్యదర్శిగా టి. లింగారెడ్డి (హనుమకొండ) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. డీటీఎఫ్ రాష్ట్ర కౌన్సిల్ సమావేశంలో కొత్త కమిటీని ఎన్నుకున్నారు.
రాష్ట్ర ఉపాధ్యక్షులుగా పి. శంతన్ (నిజామాబాద్), వి. రాజిరెడ్డి (కరీంనగర్), టి. శ్రీశైలం (మహబూబ్ నగర్), బి. రేణుక (హైదరాబాద్), చాప బాబు (ములుగు), కార్యదర్శులుగా ఎం. సామ్యూల్ (అదిలాబాద్), జె. రామస్వామి (నాగర్ కర్నూల్), ఎ. శ్రీనివాసరెడ్డి (హనుమకొండ), బి. శ్యామ్ (పెద్దపల్లి), ఆర్. లింగయ్య (సూర్యాపేట) ఎంపికయ్యారు. అధ్యాపక జ్వాల పత్రికకు ప్రధాన సంపాదకుడిగా డాక్టర్ ఎం. గంగాధర్ (హనుమకొండ) వ్యవహరించనున్నారు.