చికెన్ బిర్యానీలో కాకి మాంసం.. నిందితులు అరెస్ట్

చికెన్ బిర్యానీలో కాకి మాంసం.. నిందితులు అరెస్ట్

వీధుల్లో, ప్రధాన రహదారుల్లో చికెన్ లాలీపాప్స్, చికెన్ బిర్యానీ తో పాటు రకరకాలైన నాన్ వెజ్ ఐటమ్స్ అతి తక్కువ ధరకే అమ్ముతుండడం మనం గమనిస్తూనే ఉంటాం. ధర తక్కువే కధా అని లొట్టలేసుకొని మరీ తింటాం. కానీ ఇసారి అలా తినే ప్రయత్నం చేయాలనుకుంటే ఒక్కసారి ఆలోచించి మీకు కావాల్సిన నాన్ వెజ్ ఐటమ్స్ టేస్ట్ చేయండని తమిళనాడు పోలీసులు చెబుతున్నారు.

తమిళనాడులో  నాన్ వెజ్ పేరుతో జరుగుతున్న భారీ కుంబకోణం వెలుగులోకి వచ్చింది. తమిళనాడు రామేశ్వరంలో ఓ దేవాలయంలో భక్తులు వేసిన బియ్యం తిని కాకులు చనిపోతున్నాయి. కాకులు చనిపోవడాన్ని గుర్తించిన భక్తులు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు దేవాలయం పరిసర ప్రాంతాల్లో రెక్కీ నిర్వహించారు.

ఓ సమయంలో ఆ దేవలయానికి వచ్చిన ఓ వ్యక్తి కాకులకు బియ్యం చల్లి, అవి స్పృహ కోల్పోయిన తరువాత వాటిని తీసుకెళ్లడాన్ని పోలీసులు గమనించారు.

బియ్యం చల్లిన వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. టెంపుల్లో కాకులకు చల్లుతున్న బియాన్ని మద్యంలో కలుపుతున్నామని, ఆ బియ్యం తిన్న కాకులు స్పృహకోల్పోతున్నాయని చెప్పాడు. ఆ కాకి మాంసంతో బిర్యానీ చేస్తున్నట్లు, పలు హోటళ్లలో నాన్ వెజ్ ఐటమ్స్ లో కలుపుతున్నట్లు ఒప్పుకున్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

అయితే ఇలా కాకులు, జంతువులతో బిర్యానీ, నాన్ వెజ్ ఐటమ్స్ లో కలిపి అమ్మడం ఇప్పుడే కాదు..2016లో ముంబై  ప్రాంతానికి చెందిన వ్యాపారస్థులు కుక్కమాంసాన్ని చికెన్ లో కలుపుతూ పోలీసులకు పట్టుబడ్డారు.

2018లో చెన్నై నుంచి జోధ్ పూర్ కు ట్రైన్ లో వెళుతున్న ఇద్దరి నిందితుల్ని రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి సుమారు 1000కిలోల కుళ్లిన మాంసాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆ కుళ్లిన మాంసాన్న జోద్ పూర్ చికెన్ మార్కెట్ లలో అమ్మేందుకు తీసుకెళుతున్నట్లు నిందితులు చెప్పారు.