నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్స్ ఉన్నా.. సిజేరియన్ చేస్తున్నారట

నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్స్ ఉన్నా.. సిజేరియన్ చేస్తున్నారట

కాన్పు కోసం హాస్పిటల్స్‌‌కు వచ్చే గర్భిణులకు కోత తప్పడం లేదు. డబ్బులు దండుకునేందుకు అలవాటు పడిన ఆసుపత్రులు‌ అవసరం ఉన్నా, లేకున్నా సిజేరియన్‌‌ డెలివరీలే చేస్తున్నాయి. బిల్లుల రూపంలో లక్షలు రూపాయలు రాబట్టుకునేందుకు ఆపరేషన్లు చేస్తున్నాయి. సందర్భాన్ని బట్టి గర్భిణికి ఏదో ఒక సమస్య ఉందంటూ.. భయపెట్టి ఆపరేషన్‌‌ పై మొగ్గు చూపేలా చేస్తున్నాయి. దీంతో పలు ఆసుపత్రుల్లో సిజేరియన్‌‌ డెలివరీలు పెరిగిపోతుండగా.. ఆపరేషన్‌‌ చేయించుకున్న మహిళలు అనేక సమస్యలతో బాధపడుతున్నారు.

నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్స్ ఉన్నా సిజేరియన్ చేస్తున్నారనే అనుమానంతో పలు ఆసుపత్రులపై ఆరోగ్య శాఖ అధికారులు వరుస తనిఖీలు నిర్వహిస్తున్నారు. తాజాగా సూర్యాపేట జిల్లా కేంద్రంలో అధిక సిజేరియన్ కాన్పులు చేస్తున్న హాస్పిటల్స్‌‌ పై జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు దాడులు చేపట్టారు. ఈ క్రమంలో ఆసుపత్రుల్లోని సిజేరియన్ కాన్పులు, అబార్షన్ రికార్డులను స్వాధీనం చేసుకున్నారు అధికారులు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని పలు ఆసుపత్రులకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖా అధికారి కోటా చలం నోటీసులు జారీ చేశారు.

Also Read :నలుగురు ఎమ్మెల్యేలకు హైకోర్టు నోటీసులు

నార్మల్ డెలివరీ జరిగే అవకాశమున్నా.. సిజేరియన్ కాన్పులు చేస్తున్నారన్న అనుమానంపై సోదాలు చేపట్టామని అధికారులు వెల్లడించారు. ఇప్పటి వరకు 8 ఆసుపత్రుల్లో అధికంగా సిజేరియన్ కాన్పులు చేసినట్టు గుర్తించారు. సిజేరియన్లు తగ్గించి నార్మల్‌‌ డెలివరీలు పెంచాలని, ప్రభుత్వం పదేపదే చెబుతున్నా కొన్ని‌ హాస్పిటల్స్‌‌ మాత్రం పట్టించుకోవడం లేదు.