అసెంబ్లీ ఎన్నికల్లో వీళ్లు చాలా గ్యాప్ తర్వాత గెలిచారు

అసెంబ్లీ ఎన్నికల్లో వీళ్లు చాలా గ్యాప్ తర్వాత  గెలిచారు
  • ఎమ్మెల్యేగా 14 ఏండ్ల తర్వాత కడియం..19 ఏండ్ల తర్వాత వంశీకృష్ణ, మల్ రెడ్డి విజయం

హైదరాబాద్, వెలుగు: ఇటీవలి ఎన్నికల్లో గెలిచిన పలువురు ఎమ్మెల్యేలు చాలా ఏండ్ల గ్యాప్ తర్వాత తిరిగి అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. మొత్తం 119 మంది ఎమ్మెల్యేల్లో 51 మంది తొలిసారి గెలిచినోళ్లు ఉండగా.. కొంత మంది 2, 3, 4,  5, 6 సార్లు గెలిచినోళ్లు ఉన్నారు. ఇందులో ముగ్గురు ఎమ్మెల్యేలు మాత్రం 14 ఏండ్ల లాంగ్ గ్యాప్ తరువాత ఇటీవల ఎన్నికల్లో గెలిచారు. 

స్టేషన్ ఘన్ పూర్ నుంచి కడియం శ్రీహరి (చివరిసారి 2008 బై పోల్ లో గెలిచారు), అచ్చంపేట నుంచి చిక్కుడు వంశీకృష్ణ (చివరిసారి 2004లో విన్), ఇబ్రహీంపట్నం నుంచి మల్ రెడ్డి రంగారెడ్డి (చివరిసారి 2004లో విన్) ఇటీవల మళ్లీ గెలిచారు. మరో 11 మంది ఎమ్మెల్యేలు ఉమ్మడి రాష్ట్రంలో గెలవగా తెలంగాణ ఏర్పడిన తర్వాత ఇప్పుడే తొలిసారి ఎన్నికయ్యారు. వీరిలో కూనంనేని సాంబశివరావు, యెన్నం శ్రీనివాస్ రెడ్డి, గడ్డం వినోద్, సునీత లక్ష్మారెడ్డి, బాలు నాయక్, సుదర్శన్ రెడ్డి, మహేశ్వర్ రెడ్డి, విజయ రమణా రావు, దామోదర రాజనర్సింహ, గడ్డం ప్రసాద్, రేవూరి ప్రకాష్ రెడ్డి ఉన్నారు.