
ఆదిలాబాద్జిల్లాలో రియల్ మాఫియా పడగ విప్పింది. వివాదంలో ఉండి ఈడీ స్వాధీనం చేసుకున్న భూమిని కూడా వదల్లేదు. కోట్ల విలువైన భూ కుంభకోణానికి పాల్పడింది రియల్ ఎస్టేట్ ముఠా. ఈ భారీ భూకుంభకోణంగా స్థానికంగా కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే..
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఈసీ స్వాధీనంలో ఉన్న కోట్లాది రూపాయల విలువైన భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్చేయించుకున్నారు కొంతమంది వ్యక్తులు. ఆ భూమి ఎస్ బీఐ మార్ట్ గేజ్ లో కూడా ఉంది. అయినప్పటికీ రమేష్శర్మ, మామ్లా శేఠ్లు మరికొంత మందితో కలిసి ముఠాగా ఏర్పడి భూమిని అక్రమంగా కొల్లగొట్టారు.
విషయం బయటికి రావడంతో 10మందిపై కేసు నమోదు చేశారు పోలీసులు. నిందితులు రమేష్ శర్మ, మామ్లా శేఠ్ ను అరెస్ట్ చేశారు పోలీసులు.