హక్కులు ఎవ్వరికైనా ఒక్కటే

హక్కులు ఎవ్వరికైనా ఒక్కటే

న్యూఢిల్లీ: సబ్ కా సాథ్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్, సబ్ కా ప్రయాస్ అన్న లక్ష్యంతో పని చేస్తున్నామని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. కొద్ది మందికే ప్రయోజనం చేకూర్చే పథకాలు ప్రారంభిస్తే హక్కుల సమస్యలు వస్తాయని చెప్పారు. అందుకే అన్ని పథకాలు, అందరికీ దక్కాలన్న లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామని తెలిపారు. జాతీయ మానవ హక్కుల కమిషన్ 28వ వ్యవస్థాపక దినోత్సవంలో వర్చువల్ పద్ధతిలో మోడీ పాల్గొన్నారు. దేశంలో మహిళల భద్రతకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. ట్రిపుల్ తలాక్‌ను రద్దు చేసి ముస్లిం మహిళలకు కొత్త హక్కులు అందించామన్నారు. 

‘ఈ రోజుల్లో మానవ హక్కులను ఎవరికి వారు తమకు నచ్చిన కోణంలో చూస్తున్నారు. కొన్ని కేసుల్లో మానవ హక్కుల ఉల్లంఘన జరిగిందటారు.. మరికొన్ని కేసుల్లో వారికి అది కనిపించదు. అలాంటి వారితో మనం జాగ్రత్తగా ఉండాలి. మానవ హక్కులను రాజకీయ కోణంలో నుంచి చూడటం మంచిది కాదు. అది ఆ హక్కులతోపాటు ప్రజాస్వామ్యానికి చేటు చేస్తుంది. ఇలాంటి సంకుచిత మనస్తత్వం దేశ ప్రతిష్టను దిగజారుస్తుంది’ అని మోడీ పేర్కొన్నారు.   

మరిన్ని వార్తలు: 

భార్య ఆస్తి కొట్టేయాలని త్రాచుపాముతో కాటేయించాడు

నా రాజీనామా వెనక బలమైన రీజన్ ఉంది: ప్రకాశ్ రాజ్

క్వారంటైన్‌లో బిడ్డకు జన్మనిచ్చిన శ్రియ