
చెమట వల్ల శరీరంలో ఉన్న మురికి అంతా బయటికి వస్తుంది. అది శరీరంపైన పేరుకుపోయి బ్యాక్టీరియా తయారవుతుంది. దాని వల్లే కొందరికి కాస్త చెమట పట్టినా అండర్ ఆర్మ్స్ నుంచి చెడు వాసన వస్తుంటుంది. ఈ సమస్యనుంచి బయటపడాలంటే కొన్ని చిట్కాలు పాటించాలి. నిమ్మరసాన్ని అండర్ ఆర్మ్స్‌లో (చంకల్లో) రాయాలి. ఆరాక గోరువెచ్చని నీళ్లతో కడిగేయాలి. నిమ్మరసంలో ఉన్న యాంటీ బ్యాక్టీరియల్ లక్షణం చెడు వాసన పోగొడుతుంది. అంతేకాకుండా బేకింగ్ సోడాలో నీళ్లు కలిపి పేస్ట్ చేసి అండర్ ఆర్మ్స్‌లో రాసినా చెడు వాసన రాదు. టేబుల్ స్పూన్ యాపిల్ సిడార్ వెనిగర్‌ను అరకప్పు నీళ్లలో కలిపి దూదితో అండర్ ఆర్మ్స్‌లో రాసినా రిజల్ట్ ఉంటుంది.
గ్రీన్ టీ తాగినా లేదా గ్రీన్ టీ నీళ్లను చెమట పట్టే చోట రాసినా యాంటీఆక్సిడెంట్‌గా పని చేసి చెడు వాసన పోగొడుతుంది. మూడు టేబుల్ స్పూన్ల రోజ్ వాటర్‌లో ఒక కప్పు వెనిగర్ కలిపి అండర్ ఆర్మ్స్‌లో స్ప్రే చేసినా మంచి రిజల్ట్ ఉంటుంది. వేడి నీళ్లలో ఎప్సమ్ సాల్ట్ కలిపి స్నానం చేస్తే చెడు వాసనతో పాటు, ఒత్తిడి కూడా తగ్గుతుంది. మెంతులను నీటిలో వేసి మరిగించి ఆ నీళ్లను రోజూ పరగడుపున తాగాలి. మెంతుల్లో ఉన్న యాంటీఆక్సిడెంట్ లక్షణాలు శరీరంలో ఉన్న వ్యర్థాలను పోగొడతాయి. యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలు చెడు వాసన రాకుండా చేస్తాయి.