అమ్మానాన్నల విడాకుల గురించి డైరెక్ట్గా అడిగేసా: రోషన్ కనకాల

అమ్మానాన్నల విడాకుల గురించి డైరెక్ట్గా అడిగేసా:  రోషన్ కనకాల

టాలీవుడ్ ప్రముఖ యాంకర్ సుమ కనకాల(Suma kanakala), నటుడు రాజీవ్ కనకాల(Rajeev Kanakala) కొడుకు రోషన్ కనకాల(Roshan Kanakala) హీరోగా ఎంట్రీ ఇస్తున్న మూవీ బబుల్ గమ్(Bubblegum). రవికాంత్‌ పేరేపు దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా..  డిసెంబర్‌ 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. అవుట్ అండ్ అవుట్ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమా సోషల్ మీడియాలో మంచి బజ్ క్రియేట్ చేసింది. ఇక ఈ సినిమా నుండి రిలీజైన హైదరాబాద్ రాప్ సాంగ్ ఎంత వైరల్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో.. ప్రమోషన్ మొదలుపెట్టేశారు మేకర్స్. ఇందులో భాగంగా హీరో రోషన్ ఇంటర్వ్యూ పాల్గొన్నారు. బబుల్ గమ్ సినిమా గురించి, తన పర్సనల్ లైఫ్ గురించి చాలా ఆసక్తికరమైన విషయాలు చెప్పుకొచ్చాడు. ఇక రోషన్ అమ్మానాన్న సుమ, రాజీవ్ కనకాల విడాకులు తీసుకోనున్నారు అనే వార్తలు అప్పట్లో వైరలైన విషయం తెలిసిందే. ఈ విషయంపై కూడా స్పందించారు రోషన్

అమ్మానాన్నలు డివోర్స్ తీసుకోబోతున్నారని అప్పట్లో వార్తలు వైరల్ అయ్యాయి. నేను ఆ వార్త చదుతున్నప్పుడు వాళ్లిద్దరూ హ్యాపీగా కబుర్లు చెప్పుకుంటూ భోజనం చేస్తున్నారు. అసలేం జరుగుతుందో అర్థం కాలేదు. అందుకే.. విడాకుల గురించి డైరెక్ట్ గా అమ్మానాన్నను అడిగేశా. దానికి వాళ్లు.. ఎం మాట్లాడుతున్నావు.. అలాంటిదేం లేదని అన్నారు. ఆతరువాత కూడా చాలాసార్లు ఆ వార్తలు వినిపించాయి. నిజంగా అలాంటిదేమైనా ఉంటే.. మాకు ముందే తెలుస్తుంది కదా. ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదు. భార్యాభర్తల మధ్య సాధారణంగా ఉండే గొడవలు ఎవరింట్లో అయినా ఉంటాయి కదా.. అంటూ చెప్పుకొచ్చారు రోషన్. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.