
- క్యాన్సర్‌తో తండ్రి చనిపోతాడని
- కొడుకు ఆత్మహత్యాయత్నం
- కొన్ని గంటలకే కన్నుమూసిన తండ్రి
- అపస్మారక స్థితిలో
- చివరి చూపుకు నోచుకోని కొడుకు
గూడూరు, వెలుగు: క్యాన్సర్‌సోకిన తండ్రి మరో రెండు రోజుల్లో చనిపోతాడని తెలిసి కలత చెందిన కొడుకు ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. ఈ ఘటన జరిగిన కొన్ని గంటల్లోనే తండ్రి కన్నుమూశాడు. దీంతో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న కొడుకు తండ్రిని చివరి చూపు కూడా చూసుకోలేకపోయాడు. మహబుబాబాద్ జిల్లా గూడూరు మండలం చంద్రుగూడానికి చెందిన ఎండీ జమాల్(55) చిన్న కొడుకు మహబూబ్ పాషా. జమాల్ ఆరోగ్యం బాగాలేకపోవడంతో బుధవారం వరంగల్ హాస్పిటల్‌కు తీసుకువెళ్లారు. డాక్టర్లు అతడికి క్యాన్సర్సోకిందని, ఫైనల్స్టేజీలో ఉండడంతో రెండు రోజులకు మించి బతకడని చెప్పారు. తన తండ్రి రెండు రోజుల్లో చనిపోతాడన్న విషయాన్ని మహబూబ్ పాషా జీర్ణించుకోలేకపోయాడు. గురువారం మధ్యాహ్నం కుటుంబసభ్యులంతా తండ్రి దగ్గర హాస్పిటల్లో ఉండగా ఇంటి దగ్గర గడ్డి మందు తాగి ఫోన్‌చేసి చెప్పాడు. వారు చుట్టుపక్కల వారికి చెప్పగా వరంగల్ ఎంజీఎంకు తరలించారు. ఇది తెలుసుకున్న జమాల్కొద్ది గంటలకే తీవ్ర ఆవేదనతో కన్నుమూశాడు. మహబూబ్అపస్మారక స్థితిలో ఉండడడంతో తండ్రి మరణించిన సంగతి కూడా తెలియదు. హాస్పిటల్లో మరొకరిని ఉంచి ఇంటి దగ్గర అంత్యక్రియలు నిర్వహించారు. మరో నాలుగు రోజులు గడిస్తే గాని మహబూబ్ పాషా పరిస్థితి గురించి ఏమీ చెప్పలేమని డాక్టర్లు అంటున్నారు.