
న్యూఢిల్లీ: ఆటో కాంపోనెంట్స్ సంస్థ సోనా బీఎల్డబ్ల్యూ ప్రెసిషన్ ఫోర్జింగ్స్ లిమిటెడ్ వాటాదారులు అవసరమైన మెజారిటీతో ప్రియా సచ్‌దేవ్ కపూర్‌ను నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా నియమించడానికి ఆమోదం తెలిపారు. ఈ ఏడాది జులై 25న జరిగిన వార్షిక సర్వసభ్య సమావేశంలో మాజీ చైర్మన్ సంజయ్ కపూర్ భార్య ప్రియా నియామకాన్ని వాటాదారులు ఆమోదించారని సోనా కామ్‌స్టార్ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. ఆమె నియామకం ఈ ఏడాది జూన్ 23 నుంచి అమలవుతుంది. నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ హోదాలో అదనపు డైరెక్టర్‌గానూ నియమించారు. సోనా కామ్‌స్టార్ చైర్మన్ సంజయ్ కపూర్ జూన్ 12న లండన్‌లో పోలో ఆడుతూ మరణించారు. ఆయన మరణం తరువాత, కంపెనీ బోర్డు జూన్ 23న జెఫ్రీ మార్క్ ఓవర్లీని చైర్మన్‌గా నియమించింది.