హ్యాపీ బర్త్ డే టూ సోనాక్షి

హ్యాపీ బర్త్ డే టూ సోనాక్షి

సినీ ఇండస్ట్రీలో ప్రతీ సెలబ్రిటీకి సొంత సిగ్నేచర్ ఉంటుంది. కొందరు రెగ్యులర్ స్టైల్ను కొనసాగిస్తుండగా..మరికొందరు ప్రయోగాలతో ప్రేక్షకులను మెప్పించేందుకు ప్రయత్నిస్తుంటారు. అయితే తనదైన స్టైల్లో విభిన్న చిత్రాల్లో యాక్ట్ చేస్తూనే..  ప్రయోగాలతో ఫ్యాన్స్ ఆకట్టుకునే..అతికొద్ది మందిలో బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హా ఒకరు.  జూన్2 ఆమె పుట్టిన రోజు సందర్భంగా  సోనాక్షి సిన్హా 12 ఏళ్ల సినీ కెరీర్లో సూపర్ హిట్ సాంగ్స్ మీకోసం..

తండ్రి నటవారసత్వాన్ని కొనసాగిస్తూ..బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన నటి సోనాక్షి సిన్హా..ఫస్ట్ మూవీతోనే తనకంటే ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. 2010లో సల్మాన్ ఖాన్ చిత్రం 'దబాంగ్'తో తన నటనా జీవితాన్ని ప్రారంభించింది. ఈ చిత్రం బాక్సాఫీస్ బద్ద బ్లాక్ బస్టర్గా నిలిచింది. అంతేకాదు..2010లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల్లో దబాంగ్ ఒకటి. ఈ సినిమాలో సోనాక్షి నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారని చెప్పొచ్చు. ఈ మూవీ నటనకు గానూ ఆమెకు ఉత్తమ తొలి చిత్ర నటిగా ఫిలింఫేర్ అవార్ దక్కింది. దబాంగ్ లో చోరీ కియా రే జియా సాంగ్..అప్పట్లో దేశాన్ని ఊపేసింది. శ్రేయా ఘోషల్, సోను నిగమ్ పాడిన ఈ పాట..ఫ్యాన్స్ ఆల్ టైం ఫేవరెట్ లిస్టులో ఉండాల్సిందే. సాంగ్ సోనాక్షి నటనకు అభిమానులు ఫిదా అయ్యారు. 

2013లో వచ్చిన ఆర్ ..రాజ్ కుమార్ మూవీ ఆవరేజ్గా నిలిచినా..సోనాక్షి నటనకు మంచి మార్కులే పడ్డాయి. ముఖ్యంగా ఈ మూవీలో సారీకే ఫాల్ సా అంటూ సాగే సాంగ్ జనాన్ని ఊర్రూతలూగించింది. సాంగ్లో షాహిద్, సోనాక్షి ఎనర్జీ లెవల్స్ అదుర్స్. ముఖ్యంగా సోనాక్షి రిథమిక్ డ్యాన్స్కు థియేటర్స్లో అభిమానులు ఈలలతో సందడి చేశారు. ప్రీతమ్ కంపోజ్ చేసిన ఈ పాట..అప్పటి నుంచి ప్రతీ పార్టీలో ప్లే అవుతూనే ఉంది. 


 
2013లోనే వచ్చిన లూటేరా సినిమా ఫ్లాప్ టాక్ను తెచ్చుకుంది. సినిమా డిజాస్టర్ అయినా..సవారు లూ లూటేరా సాంగ్ క్లాసిక్ హిట్గా నిలిచింది. మోనాలీ ఠాకూర్ పాడిన ఈ పాట వింటూ ఉంటే ప్రశాంతంగా ఉంటుంది. అంతేకాదు 1950 నాటి ఫీల్ను ఫ్యాన్స్ ఎంజాయ్ చేశారు. 

2012లో వచ్చిన రౌడీ రాథోడ్  సోనాక్షి కెరియర్లో మరొక బ్లాక్ బస్టర్ మూవీ.తెలుగులో వచ్చిన విక్రమార్కుడుకు ఇది రిమేక్. ఈ చిత్రంలో చమ్మక్ చల్లో చేల్ చబేలి సాంగ్ అప్పట్లో బాగా పాపులర్ అయింది. శ్రేయా ఘోషల్-కుమార్ సాను పాడిన ఈ లవ్ సాంగ్ను ఫ్యాన్స్ విపరీతంగా విన్నారు. ముఖ్యంగా సాంగ్లో సోనాక్షి డ్యాన్స్ అభిమానులను ఆకట్టుకుంది. 

2014లో వచ్చిన హాలీడే మూవీ అప్పట్లో హిట్ టాక్ను తెచ్చుకుంది. మొత్తంగా 112 కోట్లు వసూలు చేసింది. ఈ చిత్రంలో ఆజ్ దిల్ షాయరానా సాంగ్కు ప్రేక్షకులు ముగ్ధులయ్యారు.  ప్రీతమ్ ఆధ్వర్యంలో అర్జిత్ సింగ్ పాడిన ఈ పాట..రోమాంటిక్ లవ్ సాంగ్గా నిలిచింది.