సోనమ్ కపూర్ బర్త్ డే స్పెషల్

సోనమ్ కపూర్ బర్త్ డే స్పెషల్

సోనం కపూర్..పరిచయం అక్కర్లేని పేరు. బాలీవుడ్ లోకి స్టార్ డాటర్ గా ఎంట్రీ ఇచ్చిన ఈ భామ తన ఫ్యాషన్, నటనతో అందరినీ ఆకట్టుకుంది. సావరియా సినిమాతో సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఢిల్లీ 6, ఐ హేట్ లవ్ స్టోరీస్, మౌసమ్, ప్లేయర్స్, రాంజానా, నీర్జా, ప్యాడ్ మ్యాన్, వీర్ ది వెడ్డింగ్ సహా పలు సినిమాల్లో నటించి మెప్పించింది. ఎప్పటికప్పుడు డిఫరెంట్ లుక్స్ తో అందరినీ అలరిస్తుంది ఈ స్టన్నింగ్ బ్యూటీ. ఇవాళ ఈ భామ బర్త్ డే. ఈ సందర్భంగా ఆమె నటిగా అందరినీ మెప్పించిన సినిమాలపై ఓ లుక్కేద్దాం..

రాంజానా

2013లో వచ్చిర రాంజానా మూవీలో ధనుష్, సోనం జంటగా నటించారు. బాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక బెస్ట్ లవ్ స్టోరీగా ఈ మూవీ నిలిచింది. ఈ మూవీలో జోయా వంటి సంక్లిష్టమైన పాత్రను సోనమ్ అద్భుతంగా పోషించింది. ఈ మూవీ తర్వాత సోనమ్ కు వరుస అవకాశాలు లభించాయి.


నీర్జా

నీర్జా మూవీలో తన నటనకు గానూ నీరాజనాలు అందుకుంది సోనమ్ కపూర్. 1986 లో జరిగిన  విమానం హైజాక్ నేపథ్యంలో తెరక్కెక్కిన ఈ మూవీలో ఎయిర్ హోస్టెస్ నీర్జా బానోత్ పాత్రలో నటించింది సోనమ్. అప్పటివరకు గ్లామరస్ ఈరోయిన్ గా పేరుతెచ్చుకున్న ఈ భామ ఈ మూవీతో నటిగానూ నిరూపించుకుంది.  ఆమె నటనకు విమర్శకులు సైతం ప్రశంసలు కురిపించారు. 

ప్యాడ్మ్యాన్

అక్షయ్ కుమార్, సోనమ్ కపూర్, రాధికా ఆప్టే నటించిన ఈ మూవీ రుతుస్రావం సమయంలో మహిళలు వాడే శానిటరీ న్యాప్ కిన్లపై అంశంపై  తెరకెక్కింది. ఈ మూవీలో రుతుస్రావం సమయంలో పరిశుభ్రత గురించి అవగాహన కల్పించే మేనేజ్మెంట్ స్టూడెంట్ పాత్రలో సోనమ్ నటించింది. ఈ సినిమాలో తన నటనతో అందరినీ మెప్పించింది ఈ భామ. 

మౌసమ్

షాహిద్ కపూర్, సోనం కపూర్ జంటగా నటించిన ఈ మూవీ ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. అటు షాహిద్, ఇటు సోనం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని చేసిన ఈ మూవీ పరాజయం పొందింది. అయితే ఇందులో సోనం నటన మాత్రం ఆకట్టుకుంది.  తన స్క్రీన్ ప్రజెన్స్ తో అందరినీ మెస్మరైజ్ చేసింది ఈ ముద్దుగుమ్మ.

ఏక్ లడ్కీ కో దేఖా తో ఐసా లగా

సోనంకపూర్, అనిల్ కపూర్, రెజీనా, జూహీచావ్లా నటించిన ఈ మూవీ స్వలింగ ప్రేమ అంశంతో తెరకెక్కింది. సినిమా కథ మొత్తం నట పాత్ర చుట్టే తిరిగే పాత్రలో సోనం నటించింది. సమాజకట్టుబాట్లకు దూరంగా ఉన్న స్వీటీ పాత్రలో ఆమె ఒదిగిపోయింది.