Horror Movie: ఓటీటీలోకి 7/G బృందావ‌న కాల‌నీ హీరోయిన్ హార‌ర్ సస్పెన్స్ థ్రిల్లర్‌ మూవీ

Horror Movie: ఓటీటీలోకి 7/G బృందావ‌న కాల‌నీ హీరోయిన్ హార‌ర్ సస్పెన్స్ థ్రిల్లర్‌ మూవీ

7జీ బృదావనకాలనీ(7G Brundavancolony) ఫేమ్ సోనియా అగర్వాల్(Sonia agarwal) ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ 7జీ(7G). హారర్ అండ్ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ మూవీ జూలై ఫ‌స్ట్ వీక్‌లో థియేట‌ర్ల‌లో రిలీజై మిక్స్‌డ్ టాక్‌ను తెచ్చుకుంది. 7జీ(7G) టైటిల్ లో ఉన్న మ్యాజిక్ సినిమాలో లేకపోవడంతో ఆడియన్స్ ను మెప్పించలేకపోయింది. దీంతో 7/జీ ఈ వార‌మే ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతుంది.

రేపు ఆగ‌స్ట్ 9 నుంచి ఆహా త‌మిళ్ ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతోంది. త్వరలో తెలుగు వెర్షన్ కూడా అందుబాటులో వచ్చే అవకాశం ఉంది. సోనియా దెయ్యం పాత్రలో నటించిన ఈ సినిమాను దర్శకుడు హారూన్‌ తెరకెక్కించాడు. హీరోగా న‌టించిన సిద్ధార్థ్ విపిన్ 7/జీ సినిమాకు మ్యూజిక్ కూడా అందించాడు. 

7జీ కథేంటంటే:

ఒక ఫ్యామిలీ సొంతంగా కొత్త అపార్ట్ మెంట్ కి వెళుతుంది. భార్య వ‌ర్ష (స్మృతి వెంక‌ట్‌) క‌ల‌ను నెర‌వేరుస్తూ రాజీవ్ (సిద్ధార్థ్ విపిన్ )  అక్కడ 7/జీ అనే ఫ్లాట్‌లో అడుగుపెడ‌తారు. గృహ ప్ర‌వేశం జ‌రిగిన త‌ర్వాత రోజే రాజీవ్ ఆఫీస్ ప‌నిమీద కొన్ని రోజుల వరకు వేరే ఊరికి వెళ్లిపోతాడు. ఆ కొత్త ఇంట్లో కొడుకుతో క‌లిసి వ‌ర్ష ఉంటుంది.

ఇక ఆ ఇంట్లో ఆమెకు అనూహ్య ప‌రిణామాలు ఎదుర‌వుతాయి. ఆ క్రమంలో త‌మ‌తో పాటు ఓ ద‌య్యం కూడా ఆ ఇంట్లో ఉంద‌నే నిజం వ‌ర్ష‌కు తెలుస్తుంది. వ‌ర్ష కంటే ముందు ఆ ఇంట్లో ఉన్న మంజుల (సోనియా అగ‌ర్వాల్‌) చ‌నిపోయి ఎలా ద‌య్య‌మైంది? ఆమె మ‌ర‌ణానికి కార‌కులు ఎవ‌రు? మంజుల బారి నుంచి త‌న కొడుకును కాపాడుకోవడం కోసం వ‌ర్ష ఎలాంటి ప్రయత్నాలు చేసింది? మంజుల ప‌గ ఎవ‌రిపై అన్న‌దే ఈ మూవీ క‌థ‌. లేడీ ఓరియెంటెడ్ హార‌ర్ మూవీగా ద‌ర్శ‌కుడు హ‌రూన్ ఈ త‌మిళ మూవీని రూపొందించాడు.