ప్రధాని మోదీకి సోనియా గాంధీ లేఖ..మాకు చెప్పకుండా ఎలా చేస్తారండి..

ప్రధాని మోదీకి సోనియా గాంధీ  లేఖ..మాకు చెప్పకుండా ఎలా చేస్తారండి..

కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ  ప్రధాని మోదీకి లేఖ రాశారు.  ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల అజెండాపై  స్పష్టతను ఇవ్వాలని సోనియా ఆ లేఖలో కోరారు. విపక్షాలకు ముందస్తు సమాచారం ఇవ్వకుండా సమావేశాలు ఎలా నిర్ణయిస్తారని ఆమె  ప్రశ్నించారు.  ఈ సమావేశాల్లో 9 అంశాలపై ప్రధానంగా చర్చ జరపాలని ఆమె డిమాండ్ చేశారు.  ప్రత్యేక  సమావేశాలకు హాజరు అవుతామని సోనియా గాంధీ తెలిపారు. 

లేఖలో ఏముందంటే..

ప్రధాని మోదీ గారూ..ప్రతిపక్షాలతో ఎలాంటి చర్చలు జరపకుండానే.. ప్రత్యేక సమావేశాలకు పిలుపు ఇచ్చారు. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల అజెండాకు సంబంధించిన వివరాలేవీ విపక్షాలకు చెప్పలేదు. దేశ చరిత్రలో ప్రతిపక్షాలకు చెప్పకుండా జరగడం  ఇదే తొలిసారి. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల అజెండా ఏంటో స్పష్టమైన ప్రకటన చేయాలి.  ప్రజా సమస్యలను లేవనెత్తడమే ప్రతిపక్ష పార్టీ మా లక్ష్యం. ప్రజా సమస్యలపై చర్చ కోసం ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల్లో తగిన సమయం కేటాయించాలి.. అని లేఖలో సోనియా గాంధీ  కోరారు. 

ALSO READ : నేను చచ్చానని చెప్పిన వెధవ ఎవడ్రా : రమ్య రియాక్షన్

సెప్టెంబర్ 18 నుంచి 22 వరకు ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు జరగనున్నాయి. ఈమేరకు ఇప్పటికే కేంద్రం షెడ్యూల్ కూడా ప్రకటించింది. అయితే ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల అజెండా మాత్రం వెల్లడించలేదు. సాధారణంగా పార్లమెంట్ సమావేశాల సమయంలో  అజెండా ఏంటి..?  ఏయే అంశాలపై చర్చిస్తారనే విషయాన్ని ముందుగానే ప్రకటిస్తారు. కానీ ఈసారి మాత్రం ఎలాంటి ప్రకటనా చేయలేదు. ఈ నేపథ్యంలో జమిలి ఎన్నికల బిల్లుతో పాటు..ఇండియా పేరును భారత్ గా మార్చడం వంటే కీలక బిల్లులను ఆమోదించేందుకే ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు నిర్వహించబోతున్నట్లు  వార్తలు వినిపిస్తున్నాయి.