
కరోనా కష్టకాలంలో ప్రజలను ఆదుకుంటూ .. దేశ ప్రజల్లో ధైర్యాన్ని ఇస్తున్నారు రియల్ హీరో సోనూ సూద్. దేశంలో ఏ మూల ఎవరికి ఎలాంటి సాయం కావాలన్నా సోషల్ మీడియాల వేదికగా తెలిపితే చాలు క్షణాల్లో పరిష్కారం చూపుతున్నారు. ఇప్పటికే ఎందరో కొవిడ్ బాధితులకి భరోసాగా నిలిచిన... సోనూ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆక్సిజన్ అందక చనిపోతున్న వారి సంఖ్య ఎక్కువ అవుతుండటంతో.. ఏకంగా ఆక్సిజన్ ప్లాంట్లనే ఏర్పాటు చేసేందుకు సిద్ధమయ్యారు. ముందుగా నాలుగు ఆక్సిజన్ ప్లాంట్ల ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు. ఫ్రాన్స్‌తో పాటు ఇతర దేశాల నుంచి వీటిని కొనుగోలు చేశారు. ఢిల్లీ, మహారాష్ట్రతోపాటు కొవిడ్ కేసులు అధికంగా ఉన్న ఇతర రాష్ట్రాల్లో వీటిని ఏర్పాటు చేయబోతున్నారు. మొట్ట మొదటి ప్లాంట్ ఫ్రాన్స్ నుంచి మరో 10 రోజుల్లో ఇండియాకి రానుంది.