మాల్దీవులకు పంపమని ఫ్యాన్ ట్వీట్.. సోనూ ఫన్నీ రిప్లయ్

మాల్దీవులకు పంపమని ఫ్యాన్ ట్వీట్.. సోనూ ఫన్నీ రిప్లయ్

ముంబై: లాక్‌‌డౌన్‌‌లో వలస కూలీలను సొంతిళ్లకు చేర్చడంలో ప్రముఖ నటుడు సోనూ సూద్ విశేష కృషి చేశారు. ఆ తర్వాత కూడా ప్రజలకు ఆయన సేవలు అందించాడు. దీంతో సోనూకు మంచి పాపులారిటీ దక్కింది. అంతేగాక యునైటెడ్ నేషన్స్ డెవలప్‌‌మెంట్ ప్రోగ్రామ్ నుంచి ఎస్‌‌జీపీ స్పెషల్ హ్యూమానిటేరియన్ యాక్షన్ లాంటి ప్రతిష్టాత్మక అవార్డు కూడా సోనూకు లభించింది. ఇది పక్కనబెడితే.. తమకు సాయం కావాలంటూ సోనూ ట్విట్టర్ అకౌంట్‌‌కు చాలా మంది మెసేజ్‌‌లు చేస్తుంటారు. ఆ మెసేజుల్లో నిజంగా సాయం అవసరం అనిపించిన వాటిని ఎంచుకొని సోనూ చేయూతను అందిస్తున్నాడు. ఈ నేపథ్యంలో తమకు ఫలానా పార్టీ టిక్కెట్ కావాలంటూ, కారు కొనివ్వమంటూ కొందరు వ్యక్తులు సోనూకు ఫన్నీ మెసేజ్‌‌లు చేస్తుంటారు. సోనూ కూడా వాటికి అంతే సెటైరికల్‌‌గా రిప్లయి ఇస్తుంటాడు. తాజాగా ఓ నెటిజన్ తనకు మాల్దీవులకు వెళ్లాలని ఉందని, అక్కడికి పంపమంటూ సోనూ సూద్‌‌కు మెసేజ్ చేశాడు. దీనికి స్పందించిన సోనూ.. సైకిల్ పై వెళ్తారా లేదా రిక్షా మీద వెళ్తారా భాయ్ అంటూ కొంటెగా సమాధానమిచ్చాడు. ఈ ట్వీట్ ఇప్పుడు నెట్‌‌లో వైరల్ అవుతోంది.