మటన్ షాపా.. వెజ్ షాపైతే సాయం చేస్తా..

మటన్ షాపా.. వెజ్ షాపైతే సాయం చేస్తా..

అటు కరోనా వైరస్, ఇటు లాక్‌డౌన్‌తో ఇబ్బందులు పడుతున్న వారిని నటుడు సోనూ‌సూద్ ఆదుకుంటున్నాడు. ఆయన తాజాగా V6 తీన్మార్‌లో ప్రసారమైన కథనానికి స్పందించారు. కరీంనగర్ సుల్తానాబాద్‌కు చెందిన కన్నయ్య మటన్ వ్యాపారం చేస్తుంటాడు. ఆయన తాను అమ్మె కిలో మటన్‌కి వచ్చే డబ్బులలో  50  రూపాయల చొప్పున సోనూ‌సూద్ ఫౌండేషన్‌కు విరాళంగా ఇస్తున్నాడు. ఈ విషయాన్ని V6 చానల్ తీన్మార్ న్యూస్ ప్రసారం చేసింది. ఈ విషయం సోనూ‌సూద్ దృష్టికి వెళ్లింది. దాంతో కన్నయ్య సాయం గురించి సోనూ స్పందించాడు. తనకొచ్చె కొద్ది లాభం నుంచి తన ఫౌండేషన్‌కు  సాయం చేయాడాన్ని సోనూ ప్రసంసించారు. తాను శాఖాహారినని... మటన్ షాప్ బదులుగా.. ఏదైనా వెజిటెరీయన్ షాపు పెట్టుకుంటానంటే తప్పకుండా సాయం చేస్తానంటూ ఫన్నీగా ట్వీట్ చేశారు.