సోనూ సూద్‌‌కు కరోనా పాజిటివ్

V6 Velugu Posted on Apr 17, 2021

ముంబై: ప్రముఖ నటుడు సోనూ సూద్‌ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియా ద్వారా తెలిపారు. ‘ఈ ఉదయం నాకు కరోనా పాజిటివ్‌‌గా తేలింది. ముందు జాగ్రత్తగా నేను క్వారంటైన్‌‌లో ఉంటున్నా. చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నా. ఎవరూ ఆందోళన చెందొద్దు. ఈ ఖాళీ సమయాన్ని ఆపదలో ఉన్న వారి సమస్యలను పరిష్కరించేందుకు వినియోగిస్తా. వారికి నేను ఎప్పుడూ అండగా ఉంటా’ అని సోనూ ట్వీట్ చేశారు. 

దేశంలో కరోనా పరిస్థితుల మీద రీసెంట్‌‌గా సోనూ ఓ ట్వీట్ చేశారు. కరోనాతో భయానక పరిస్థితులు నెలకొన్నాయని, అందరూ తప్పనిసరిగా జాగ్రత్తలు పాటిస్తూ ఇళ్ల వద్దే ఉండాలని సూచించారు. తనకు ఎన్నో ఫోన్ కాల్స్ వస్తున్నాయని.. ఆస్పత్రుల్లో బెడ్‌‌లు, మెడిసిన్స్, ఇంజెక్షన్‌‌లు దొరకట్లేదని వేలాది మంది ఫోన్‌లో వాపోతున్నారని సోనూ పేర్కొన్నారు. వాళ్లకేమీ చేయలేకపోతున్నానని తనకు బాధేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. మనమందరమూ కలిస్తే చాలా మంది ప్రాణాలను కాపాడగలమని.. ఆపదలో ఉన్న వారిని దయచేసి ఆదుకోండని సోనూ విజ్ఞప్తి చేశారు.
 

 

Tagged Actor Sonu Sood, quarantine, corona possitive, Amid Covid Surge

Latest Videos

Subscribe Now

More News