
పద్మారావునగర్, వెలుగు: ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన ఫిష్ వెంకట్ కుటుంబాన్ని బాలీవుడ్ నటుడు సోను సూద్ పరామర్శించారు. సోమవారం అడ్డగుట్టలో వారి నివాసానికి వెళ్లి సానుభూతి తెలిపారు. ఫిష్ వెంకట్ మరణం తనను బాధించిందని, షూటింగ్ సెట్స్‌లో తనతో అత్యంత ఆప్యాయంగా ఉండే వారని గుర్తు చేసుకున్నారు. ఫిష్ వెంకట్ మరణం తీరని లోటని, బాధిత కుటుంబానికి అన్ని విధాల అండగా ఉంటామని హామీఇచ్చారు.