ముఖేష్ ‘టీవీ’ కోసం సోనీ ప్రయత్నాలు

ముఖేష్ ‘టీవీ’ కోసం సోనీ ప్రయత్నాలు

న్యూఢిల్లీ : బిలినీయర్ ముఖేష్ అంబానీకి చెందిన టెలివిజన్ నెట్‌‌వర్క్‌‌లో వాటాలు కొనాలని సోనీ కార్పొరేషన్ చూస్తోంది. వాటాలను పొందేందుకు చర్చలు కూడా మొదలు పెట్టింది. ఇండియాలో కంటెంట్‌‌కు విపరీతంగా డిమాండ్ పెరుగుతుండటంతో సోనీ ఈ నిర్ణయం తీసుకున్నట్టు సంబంధిత వర్గాలు చెప్పాయి. పలు డీల్‌‌ స్ట్రక్చర్లను సోనీ పరిశీలిస్తోందని తెలిపాయి. ముఖేష్ కంపెనీ కోసం బిడ్ వేయడం లేదా నెట్‌‌వర్స్ 18 ఎంటర్‌‌‌‌టైన్‌‌మెంట్ ఛానల్స్‌‌ను తన ఇండియన్ వ్యాపారాల్లో విలీనం చేసుకోవడమో చేయాలని చూస్తోందని పేర్కొన్నాయి. ప్రస్తుతం చర్చలు తొలి దశలోనే ఉన్నాయని తెలిసింది. ఈ వార్తల నేపథ్యంలో నెట్‌‌వర్క్18 షేర్లు గురువారం ఇంట్రాడేలో 19 శాతానికి పైగా పెరిగాయి. అదేవిధంగా యూనిట్ టీవీ18 బ్రాడ్‌‌కాస్ట్ 9.7 శాతం జంప్ చేశాయి.

లోకల్‌‌ కంటెంట్‌‌ తయారీ..

ఒకవేళ ఈ డీల్ కనుక సక్సెస్ అయితే, లోకల్‌‌ కంటెంట్‌‌ను అందించడంలో సోనీ సాయం చేసినట్టవుతుంది. నెట్‌‌ఫ్లిక్స్‌‌ ఇంక్ లాంటి ప్రత్యర్థులకు గట్టి పోటి ఇస్తుంది. ఇంటర్నేషనల్ కంటెంట్ ఇచ్చేందుకు అంబానీకి యాక్సస్ లభిస్తుంది. ప్రస్తుతం తమ కంపెనీ పలు అవకాశాల కోసం చూస్తోందని రిలయన్స్ ఇండస్ట్రీస్ అధికార ప్రతినిధి చెప్పారు. మరింత వివరాలు అందించేందుకు నిరాకరించారు. ఈ విషయంపై  ఇండియా, జపాన్‌‌లోని సోనీ ప్రతినిధులు వెంటనే స్పందించలేదు. సబ్‌‌స్క్రయిబర్లను పొందడం కోసం  నెట్‌‌ఫ్లిక్స్ నుంచి అమెజాన్.కామ్ ఇంక్ వరకున్న స్ట్రీమింగ్ కంపెనీలు లోకల్‌‌గా కంటెంట్ క్రియేట్‌‌ చేసిన ప్రొగ్రామ్‌‌లను ఆఫర్ చేస్తున్నాయి. ‘ఇండియాలో ఓటీటీ మార్కెట్ చాలా పెద్దది. ఇంటర్నేషనల్‌‌ ఓటీటీ ప్లే కచ్చితంగా లోకల్ స్ట్రాటజీని అందించాల్సి ఉంది’ అని బెక్స్‌‌లీ అడ్వయిజర్స్ ఎండీ ఉత్కర్ష్‌‌ సిన్హా చెప్పారు. వచ్చే ఏడాదిలో ఇలా ఒప్పందాలు మరిన్ని జరుగొచ్చన్నారు. సోనీ పిక్చర్స్ నెట్‌‌వర్క్స్ ఇండియా ద్వారా ఇండియాలో సోనీ ఆపరేట్ అవుతుంది. సోనీ ఎంటర్‌‌‌‌టైన్‌‌మెంట్ టెలివిజన్ వంటి ఛానళ్లు దీనిలో భాగమే. సోనీకి ఇండియాలో 70 కోట్లకు పైగా ప్రేక్షకులున్నారు. టీవీ18 బ్రాడ్‌‌కాస్ట్ ఇండియాలో 56 ఛానళ్లను ఆపరేట్ చేస్తోంది. ఇంటర్నేషనల్‌‌గా 16 ఛానళ్లున్నాయి.

మరిన్ని వార్తల కోసం