
పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి శనివారం హైదరాబాద్ కు వచ్చారు కేంద్ర హోం మంత్రి, బీజేపీ చీఫ్ అమిత్ షా. ముందుగా రంగనాయక్ తండా కు వెళ్లి.. సోనీబాయ్ నాయక్ కుటుంబానికి పార్టీ సభ్యత్వం ఇచ్చారు. పార్టీ అధినాయకుడే ఇంటికి వచ్చాడని సోనీబాయ్ అమిత్ షాకు వండి పెట్టింది. తానే స్వయంగా జొన్న రొట్టె చేయగా.. ఆమె కోడళ్లు.. ఉక్మా, చెపాతి, కంది పప్పు, పుంటికూర చేసి పెట్టారు.
మీకు తోచిందే చేసి పెట్టారా లేక ఎవరైనా ఈ వంటకాలు చేయమన్నారా అని మా వీ6 ప్రతినిధి సోనీబాయ్ ను అడగగా.. తన ఇష్టప్రకారమే, తనకు తోచిందే వండానని చెప్పింది. ప్రభుత్వం తరపున ఫుడ్ ఇన్పెక్టర్ వండేటప్పుడు పర్యవేక్షించారు.