తమిళుల ఆగ్రహం: వివాదంలో రజనీ కూతురు ఫొటో

తమిళుల ఆగ్రహం: వివాదంలో రజనీ కూతురు ఫొటో

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కూతురు సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఓ ఫొటో వివాదం అయింది. రజనీ కూతురు సౌందర్య తన కొడుకుకు స్విమ్మింగ్ ఫూల్ లో ఈత నేర్పిస్తున్న ఫొటోను సోషల్ మీడియా లో పెట్టింది. ఇందుకు.. తమిళ ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. దీంతో ఆ ఫొటోను డిలీట్ చేసింది సౌందర్య.

చెన్నైలోని రిజర్వాయర్లలో నీళ్లు అడుగంటి.. నగరంలోని 40శాతం ఏరియాకు నీటి సరఫరా బంద్ అయింది. అక్కడి ప్రజలు నీళ్ల కోసం దేవులాడుతున్నారు. ఇలాంటి సమయంలో సౌందర్య స్విమ్మింగ్ ఫూల్ లో  దిగిన ఫొటో పెట్టడంతో… నెటిజన్లు ఫైర్ అయ్యారు. నగర ప్రజలు నీటి కొరతతో బాధపడుతుంటే మరోవైపు స్విమ్మింగ్ తో మీరు నీళ్లను వేస్ట్ చేస్తారా అంటూ పోస్ట్ లు పెట్టారు. ఫొటోను డిలీట్ చేసిన సౌందర్య తనకు నగర పౌరుల బాధ తెలుసని.. తాను కేవలం చిన్న వయసులో పిల్లలకు ఈత నేర్పిస్తే బలంగా తయారవుతాని తెలియజేయడం కోసమే పెట్టానని వివరణ ఇచ్చింది.