
మధ్యప్రదేశ్‌లోని భిండ్ జిల్లాలో పరీక్ష సమయంలో ఓ ప్రభుత్వ అధికారి విద్యార్థిని చెంపదెబ్బ కొట్టడం తీవ్ర సంచలనం సృష్టించింది. అయితే ఏప్రిల్ 1న జరిగిన ఈ ఘటన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియోలో కనిపిస్తున్న అధికారి భిండ్ జిల్లా మేజిస్ట్రేట్ సంజీవ్ శ్రీవాస్తవ, ఈ సంఘటన దీన్‌దయాళ్ దంగ్రౌలియా మహావిద్యాలయలో బిఎస్సి 2వ సంవత్సరం మ్యాథ్స్ పరీక్ష సమయంలో జరిగింది.
వీడియోలో, చూస్తే శ్రీవాస్తవ చేతిలో పేపర్ పట్టుకుని ఓ విద్యార్థిని కుర్చీలోంచి లాగి చెంపదెబ్బలు కొడుతుండటం కనిపిస్తుంది. మరో వీడియోలో విద్యార్థిని స్టాఫ్ రూంలాగ కనిపించే మరొక రూంకి తీసుకెళ్తున్నట్లు చూడొచ్చు. ఆ తర్వాత ప్రభుత్వ అధికారి రోహిత్ రాథోడ్ విద్యార్థి వైపు చూపిస్తూ రూంలోని ఒక వ్యక్తికి పేపర్ ఇస్తాడు. రోహిత్ రాథోడ్ కొట్టడం వల్ల తన చెవి దెబ్బతిన్నదని విద్యార్థి ఆరోపించగా, ఆయన ఐఏఎస్ అధికారి కాబట్టి నేను ఎం చెప్పలేకపోయాను అని అన్నారు.
అయితే, సంజీవ్ శ్రీవాస్తవ మాట్లాడుతూ అతని చేసిన పనిని సమర్థించుకున్నారు. కాలేజీలో చీటింగ్ జరుగుతుందని తనకు ఫిర్యాదులు వచ్చాయని, కొంతమంది విద్యార్థులు క్వశ్చన్ పేపరును బయటకు పంపి, వాటి సమాధానాలను కాపీ కొడుతున్నారని ఆయన ఆరోపించారు. అలాగే ఒక చీటింగ్ రాకెట్ దర్యాప్తు చేయడానికి నేను అక్కడికి వెళ్లాను. భవిష్యత్తులో కాలేజీలను ఇలా ఉపయోగించకూడదని సిఫార్సు చేస్తూ విశ్వవిద్యాలయానికి కూడా లేఖ రాశాను" అని శ్రీవాస్తవ అన్నారు.
సీనియర్ అధికారుల ప్రకారం, ఆ కాలేజీ మధ్యప్రదేశ్‌లో ప్రతిపక్ష నాయకుడు హేమంత్ కటారే మామ నారాయణ్ దంగ్రౌలియాకు చెందినది. మరోవైపు కలెక్టర్ సంజీవ్ శ్రీవాస్తవ వివాదాస్పద కారణాల వల్ల వెలుగులోకి రావడం ఇదేం మొదటిసారి కాదు.
కొద్దీ రోజుల క్రితం, మధ్యప్రదేశ్ హైకోర్టు గ్వాలియర్ బెంచ్, పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్‌కు సంబంధించిన కేసును విచారిస్తున్నప్పుడు శ్రీ శ్రీవాస్తవ ప్రవర్తనపై మాట్లాడుతూ "అటువంటి అధికారి ఈ రంగంలో కొనసాగాలా వద్దా అని ప్రధాన కార్యదర్శి నిర్ణయించుకోవాలి" అని చెప్పింది.
పెరుగుతున్న ఒత్తిడికి తోడు, ప్రస్తుతం భిండ్‌లో విధులు నిర్వహిస్తున్న తహసీల్దార్ మాలా శర్మ ఇటీవల కలెక్టర్ శ్రీవాస్తవ SDM పరాగ్ జైన్ తనని మానసికంగా వేధించారని ఆరోపించారు. ముఖ్యమంత్రికి రాసిన లేఖలో ఆమె ఈ హింస కారణంగా నాకు ఏదైనా జరిగితే, బాధ్యత కలెక్టర్ సంజీవ్ శ్రీవాస్తవ, గోహద్ SDM పరాగ్ జైన్‌లదే అంటూ రాసింది