ఏడుగురు కెప్టెన్లు కరెక్ట్ కాదు

 ఏడుగురు కెప్టెన్లు కరెక్ట్ కాదు

న్యూఢిల్లీ: గత కొంత కాలంగా ఇండియా ఆడిన మ్యాచ్ల్లో  ఏడుగురిని కెప్టెన్లుగా నియ మించడం సరైంది కాదని బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ అన్నాడు. 'ఇంత తక్కువ టైమ్లో ఎక్కువ మంది కెప్టెన్లు ఉండటం ఆమోదయోగ్యం కాదు. దీనిని నేను పూర్తిగా అంగీకరిస్తున్నా. కానీ అనుకోని పరిస్థితుల్లో అలా జరిగిపోయింది. సౌతాఫ్రికాలో వైట్బాల్ సిరీస్కు రోహిత్ నాయకత్వం వహించడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ టూర్కు ముందు గాయపడ్డాడు. అప్పుడు అందుబాటులో ఉన్న రాహుల్ వన్డేల్లో టీమ్ను నడిపించాడు. ఇటీవల సఫారీలతో సిరీస్ ప్రారంభానికి ముందు రాహుల్కు ఇంజ్యూరీ అయ్యింది. ఇంగ్లండ్లో  వామప్ మ్యాచ్ ఆదే టప్పుడు రోహిత్కు కొవిడ్ సోకింది. దీంతో తప్పనిసరిగా మరో కెప్టెన్ను నియమించాల్సి వచ్చింది. గాయాలు, రెస్ట్, పని భారాన్ని బట్టి కొన్ని సారు మార్పులుంటాయి' అని దాదా పేర్కొన్నాడు.