ఐసీసీ చైర్మన్‌‌‌‌ రేస్‌‌‌‌లో నేను లేను

ఐసీసీ చైర్మన్‌‌‌‌ రేస్‌‌‌‌లో నేను లేను

న్యూఢిల్లీ: బీసీసీఐ ప్రెసిడెంట్‌‌‌‌ సౌరవ్‌‌‌‌ గంగూలీ.. ఐసీసీ చైర్మన్‌‌‌‌ ఎలక్షన్‌‌‌‌కు వీలైనంత దూరంగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నాడు. రేస్‌‌‌‌లో అందరికంటే ముందంజలో ఉన్నాడని వచ్చిన వార్తలపై దాదా నీళ్లు కుమ్మరించాడు. చైర్మన్‌‌‌‌గా పోటీ చేసే అంశం తన చేతుల్లో లేదని, బీసీసీఐ, గవర్నమెంట్‌‌‌‌ పరిధిలో ఉంటుందని చెప్పాడు.

‘ఐసీసీ చైర్మన్‌‌‌‌ రేస్‌‌‌‌లో నేను లేను. ఎందుకంటే ఆ విషయం నా పరిధిలో ఉండదు. ఏం జరగాలన్నా బోర్డు, గవర్నమెంట్‌‌‌‌ నిర్ణయం తీసుకోవాలి. ఇప్పుడు వస్తున్న వార్తలన్నీ కల్పితాలే. ఇందులో ఎలాంటి నిజం లేదు. మీరు అనుకుంటున్నట్లుగా ఏదీ జరగదు’ అని దాదా వ్యాఖ్యానించాడు. 

ప్రస్తుతం చైర్మన్‌‌‌‌గా కొనసాగుతున్న గ్రెగ్‌‌‌‌ బార్‌‌‌‌క్లే పదవీ కాలాన్ని 2024 వరకు పొడిగించడంతో గంగూలీ పోటీకి పెద్దగా సుముఖత చూపడం లేదని సమాచారం. అయితే సమయం వచ్చినప్పుడు కచ్చితంగా దాదా.. ఐసీసీ హాట్‌‌‌‌ సీట్‌‌‌‌లోకి వస్తాడని క్రికెట్‌‌‌‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి.