క్రికెట్లో సౌరవ్, సచిన్ కాంబినేషన్ సూపర్ హిట్

క్రికెట్లో సౌరవ్, సచిన్ కాంబినేషన్ సూపర్ హిట్

భారత దిగ్గజ బ్యాట్స్‌మెన్, మాజీ కెప్టెన్ బీసీసీ చీఫ్ సౌరవ్ గంగూలీ బర్త్ డే వేడుకలు  ప్రారంభమయ్యాయి. జులై 8 నాటికి గంగూలీ 50వ వసంతంలోకి అడుగు పెట్టనున్నారు. ఈ బర్త్ డే వేడుకలను గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకునేలా ఏర్పాట్లు చేశారు. ఐపీఎల్ మాజీ చైర్మన్, వెటరన్ క్రికెట్ అడ్మినిస్ట్రేటర్ రాజీవ్ శుక్లా గురువారం (జులై 7న) గంగూలీ, బీసీసీఐ సెక్రటరీ జైషా, భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌లతో కలిసి ఉన్న ఫొటోను ట్విట్టర్‌లో షేర్ చేశారు. ‘సౌరవ్ గంగూలీ 50వ పుట్టినరోజు వేడుకను నిర్వహించాం. అతనికి  సంతోషకరమైన, ఆరోగ్యకరమైన జీవితాన్ని ఇవ్వాలని దేవుడిని కోరుకుంటున్నాను’ అంటూ ట్విట్టర్ లో తెలిపారు. వన్డేల్లో గంగూలీ, టెండూల్కర్  అత్యధిక భాగస్వామ్య పరుగులతో ప్రపంచ రికార్డును నెలకొల్పారు. వీరిద్దరూ 176 ఇన్నింగ్స్‌ల్లో 47.55 సగటుతో 8,227 పరుగులు చేశారు. 2002లో ఇంగ్లండ్‌లో నాట్‌వెస్ట్ ట్రోఫీని గెలుచుకున్న జట్టులో వీరిద్దరూ కూడా ఉన్నారు.