Cricket World Cup 2023:వరల్డ్ కప్ లో ఆల్ టైం వండర్ రికార్డ్.. 49 బంతుల్లో సెంచరీ

Cricket World Cup 2023:వరల్డ్ కప్ లో ఆల్ టైం వండర్ రికార్డ్.. 49 బంతుల్లో సెంచరీ

ప్రపంచ కప్ వన్డే క్రికెట్ మ్యాచుల్లో అరుదైన రికార్డ్ క్రియేట్ అయ్యింది. శ్రీలంక, సౌతాఫ్రికా మధ్య జరుగుతున్న మ్యాచ్ లో సౌతాఫ్రికా ఆటగాళ్లు వీర విహారం చేశారు. శ్రీలంక బౌలర్లను ఉతికి ఆరేశారు. సౌతాఫ్రికా ఆటగాడు మార్ క్రమ్ అయితే వన్డేల్లోనే ఆల్ టైం రికార్డ్ క్రియేట్ చేశాడు. జస్ట్ 49 బంతుల్లోనే.. వంద పరుగులు చేశాడు. వన్డే క్రికెట్ చరిత్రలోనే 49 బంతుల్లో సెంచరీ చేసిన ఆటగాడిగా రికార్డ్ నమోదు చేశాడు మార్ క్రమ్. 

49 బంతులు ఎదుర్కొన్న మార్ క్రమ్ 14 ఫోర్లు, మూడు సిక్సులు కొట్టాడు. కేవలం ఫోర్ల ద్వారానే 56 పరుగులు రాబట్టుకున్నాడు. మూడు సిక్సులతో 18 పరుగులు.. మొత్తంగా వికెట్ల దగ్గర నిల్చుని 74 పరుగులు సాధించాడు. బాల్ వస్తే కాదు.. బాల్ వెంట పడి మరీ చితక్కొట్టాడు మార్ క్రమ్. 

వన్డేల్లో అత్యంత వేగంగా సెంచరీలు చేసిన వారి జాబితాలో మొదటి స్థానంలోకి వచ్చాడు. గతంలో 50 బంతుల్లో సెంచరీ చేసిన ఆటగాడి కెవిన్ ఉన్నాడు. 51 బంతుల్లో మ్యాక్స్ వెల్ సెంచరీ చేయగా.. 52 బంతుల్లో ఏబీ డివిలియర్స్ నిలిచాడు. మొత్తానికి ఇప్పటి వరకు ఎవరికీ సాధ్యం కాని రికార్డును సౌతాఫ్రికా ఆటగాడు మార్ క్రమ్ సాధించాడు. 49 బంతుల్లో సెంచరీ అంటే.. బాల్ కు రెండు పరుగుల కంటే ఎక్కువ రన్ రేట్..