కోల్‌కతా: ఇండియాతో తొలి టెస్ట్ కోసం సౌతాఫ్రికా ప్రాక్టీస్‌ను ముమ్మరం చేసింది. గాయం నుంచి కోలుకుని వచ్చిన కెప్టెన్ టెంబా బవుమా బుధవారం పూర్తి స్థాయిలో ఫిట్‌నెస్ డ్రిల్‌లో పాల్గొన్నాడు. ఫిజియోతో పాటు హెడ్ కోచ్ శుక్రి కాన్రాడ్ ఈ డ్రిల్‌ను పర్యవేక్షించారు. మూడు మార్కర్ కోన్‌ల మద్య షార్ట్ స్ప్రింట్‌లను ఏర్పాటుచేశారు. వాటిలో బవుమా వేగంగా పరుగెత్తాడు. దాదాపు 20 నిమిషాలు ఈ డ్రిల్ కొనసాగింది. కొద్దిసేపు తేలికపాటి వ్యాయామం తర్వాత మిగతా ప్లేయర్లతో పాటు నెట్ సెషన్‌లో పాల్గొన్నాడు. కాలిపిక్క గాయం నుంచి కోలుకున్న తర్వాత బవుమా ఇండియా–ఎతో జరిగిన మ్యాచ్‌లో సౌతాఫ్రికా–ఎ తరఫున బరిలోకి దిగాడు. హాఫ్ సెంచరీతో మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడు.
ఇండియాతో తొలి టెస్ట్ కోసం డేవాల్డ్ బ్రేవిస్ ప్లేస్‌లో బవుమా తుది జట్టులోకి వచ్చే చాన్స్ ఉంది. ‘టెంబా ఫిట్‌నెస్ మాకు చాలా కీలకం. అతను జట్టులో ఉండటం ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. గత రెండేళ్లుగా బవుమా ప్రపంచ అత్యుత్తమ ప్లేయర్లలో ఒకడిగా నిలిచాడు. కాబట్టి ఇండియాతో సిరీస్‌కు అతను అందుబాటులోకి రావడం మాకు కాన్ఫిడెన్స్ పెంచే అంశం. బ్యాటింగ్ యూనిట్‌కు తీసుకు వచ్చే ప్రశాంతత, నాయకత్వం, నిశ్శబ్దమైన ప్రవర్తన వల్ల టీమ్‌కు మంచి అనుభూతి లభిస్తుంది. ఈ సిరీస్‌లో టెంబా కచ్చితంగా ప్రభావం చూపిస్తాడు’ అని కాన్రాడ్ పేర్కొన్నాడు. ఓపెనర్ ఐడెన్ మార్‌క్రమ్, ట్రిస్టన్ స్టబ్స్, కేశవ్ మహారాజ్, సైమన్ హార్మర్, సెనురాన్ ముత్తుస్వామి, రబాడ కూడా ఫుల్ ప్రాక్టీస్‌లో పాల్గొన్నారు.
