
వెన్ను నొప్పి కారణంగా సెకండ్ టెస్టుకు దూరంగా ఉన్న కెప్టెన్ విరాట్ కోహ్లి కెప్ టౌన్ లో జరిగే థర్డ్ టెస్టుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించాడు. తాను పూర్తి ఫిట్ గా ఉన్నానని చెప్పాడు. మంగళవారం(రేపు) కేప్‌టౌన్‌లోని న్యూలాండ్స్‌లో జరిగే సిరీస్ నిర్ణయానికి "ఖచ్చితంగా ఫిట్" అని ధృవీకరించాడు. ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ ఇంకా మ్యాచ్‌కు సిద్ధంగా లేడని చెప్పాడు. అయితే సిరాజ్ ప్లేస్ లో ఎవర్నీ తీసుకుంటారనేది కోహ్లి చెప్పలేదు. అజింక్యా రహానే జట్టుకు కెప్టెన్ గా ఉన్న రెండో టెస్టులో భారత్ ఏడు వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఈ విజయంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో ఆతిథ్య జట్టు సౌతాఫ్రికా 1-1తో సమం చేసింది.