సుందర్‌‌‌‌ ప్లేస్‌‌లో జయంత్‌‌

సుందర్‌‌‌‌ ప్లేస్‌‌లో జయంత్‌‌

సిరాజ్‌‌కు బ్యాకప్‌‌గా సైనీ

ముంబై: కరోనా పాజిటివ్‌‌గా తేలిన ఇండియా స్పిన్నర్‌‌ వాషింగ్టన్‌‌ సుందర్‌‌ సౌతాఫ్రికాతో మూడు వన్డేల సిరీస్‌‌కు దూరమయ్యాడు. అతని ప్లేస్‌‌లో జయంత్‌‌ యాదవ్‌‌ను టీమ్‌‌లోకి తీసుకున్నారు.  అలాగే,  తొడ కండరాల గాయంతో ఇబ్బంది పడుతున్న పేసర్‌‌ మహ్మద్‌‌ సిరాజ్‌‌కు బ్యాకప్‌‌గా మరో యంగ్‌‌ పేసర్‌‌ నవదీప్‌‌ సైనీని సెలక్షన్‌‌ కమిటీ బుధవారం వన్డే టీమ్‌‌లో చేర్చింది. ఈ సిరీస్‌‌లో ఫస్ట్‌‌ వన్డే 19వ తేదీన పార్ల్‌‌లో జరుగుతుంది. మిగతా రెండు మ్యాచ్‌‌లు 21, 23వ తేదీల్లో జరుగుతాయి.