- తెలుగు రాష్ట్రాలు, ఇరుగు-పొరుగు రాష్టాలకు నడిచే రైళ్లు
- జూన్ 1 నుంచి 16 వరకు నడవాల్సిన రైళ్లన్నీ రద్దు
హైదరాబాద్: కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు విధించిన లాక్ డౌన్ ప్రభావంతో అడపా దడపా నడుస్తున్న రైళ్లన్నీ రద్దయిపోతున్నాయి. ఎక్కే వాళ్లు లేక.. దిగేవాళ్లు కనిపించక నామమాత్రంగా నడుస్తున్న రైళ్లను రైల్వే శాఖ రద్దు చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 19 రైళ్లను రద్దు చేసినట్లు ప్రకటించారు. జూన్ 1 నుంచి 16 తేదీ వరకు రైళ్లను తాత్కాలికంగా నిలిపేస్తున్నామని ప్రకటించింది. ఇప్పటికే రిజర్వేషన్ చేసుకున్న వారి టికెట్లు వాపస్ చేస్తున్నామని ప్రకటించింది. 16వ తేదీ తర్వాత పరిస్థితిని సమీక్షించి రైళ్లను ప్రారంభించేది లేనిది ప్రకటిస్తామని రైల్వే అధికారులు వెల్ల్లడించారు. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో జూన్ 1 నుంచి 16 వరకు రద్దయిన రైళ్ల వివరాలు ఇలా ఉన్నాయి.
1.గూడూరు నుంచి విజయవాడ
2.విజయవాడ నుంచి గూడూరు
3.గుంటూరు నుంచి వికారాబాద్
4.వికారాబాద్ నుంచి గుంటూరు
5.విజయవాడ నుంచి సికింద్రాబాద్
6.సికింద్రాబాద్ నుంచి విజయవాడ
7.బీదర్ నుంచి హైదరాబాద్
8.హైదరాబాద్ నుంచి బీదర్
9.హైదరాబాద్ నుంచి సిర్పూర్ కాగజ్ నగర్
10.సిర్పూర్ కాగజ్ నగర్ నుంచి సికింద్రాబాద్
11.సికింద్రాబాద్ నుంచి కర్నూలు సిటీ
12.కర్నూలు సిటీ నుంచి సికింద్రాబాద్
13.సికింద్రాబాద్ నుంచి సిర్పూర్ కాగజ్ నగర్
14.సిర్పూర్ కాగజ్ నగర్ నుంచి సికింద్రాబాద్
15.నర్సాపూర్ నుంచి నిడదవోలు
16.నిడదవోలు నుంచి నర్సాపూర్
17.గుంటూరు కాచిగూడ
18.కాచిగూడ నుంచి గుంటూరు
19.ఆదిలాబాద్ నుంచి హెచ్.ఎస్.నాందేడ్
20.హెచ్.ఎస్ నాందేడ్ నుంచి ఆదిలాబాద్
21.పర్బని నుంచి హెచ్.ఎస్ నాందేడ్
22.చెన్నయ్ సెంట్రల్ నుంచి తిరుపతి
23.విజయవాడ నుంచి చెన్నయ్ సెంట్రల్
24.తిరుపతి నుంచి చెన్నయ్ సెంట్రల్
