ఆదాయంలో సౌత్ సెంట్రల్ రైల్వే కొత్త రికార్డ్

ఆదాయంలో సౌత్ సెంట్రల్ రైల్వే కొత్త రికార్డ్

హైదరాబాద్, వెలుగు: సరుకు రవాణా సంపాదనలో దక్షిణ మధ్య రైల్వే రికార్డ్ క్రియేట్ చేసింది. 2022–23 ఫైనాన్సియల్ ఇయర్ లో ఈ నెల10 వ తేదీ వరకు రూ.11 వేల కోట్ల ఆదాయం వచ్చినట్లు వెల్లడించింది. జోన్ చరిత్రలో ఇంత రెవెన్యూ సాధించటం ఇదే తొలిసారని రైల్వే అధికారులు ట్వీట్ చేశారు. 2018–19 ఫైనాన్సియల్ ఇయర్ లో రూ.10,995 కోట్లు సాధించినట్లు గుర్తుచేశారు. దక్షిణ మధ్య రైల్వే రికార్డు స్థాయిలో ఆదాయం రాబట్టినందుకు అభినందనలు తెలుపుతూ ప్రధాని మోడీ రీ ట్వీట్ చేశారు.“గుడ్ ట్రెండ్, ఇది దేశ ఆర్థిక అభివృద్ధికి బాగా ఉపయోగపడుతుంది.” అని పేర్కొన్నారు.