‘మొంథా’ను ఎదుర్కొనేందుకు రెడీ..రైల్వే సేవల్లో మార్పులు ఉంటాయి: జీఎం సంజయ్ శ్రీవాస్తవ

‘మొంథా’ను ఎదుర్కొనేందుకు రెడీ..రైల్వే సేవల్లో మార్పులు ఉంటాయి: జీఎం సంజయ్ శ్రీవాస్తవ

హైదరాబాద్​సిటీ, వెలుగు: ఏపీ, తమిళనాడు, ఒడిశా తీర ప్రాంతాల్లో మొంథా తుఫాన్ ప్రభావం కారణంగా రైల్వే సేవల్లో మార్పులు ఉండే అవకాశం ఉందని దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రకటించారు. రైళ్ల రద్దు.. టైమింగ్​లో మార్పులు తెలుసుకునేందుకు ప్రయాణికుల సౌకర్యార్థం హెల్ప్​లైన్ నంబర్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మచిలీపట్నం, కాకినాడ మధ్య మంగళవారం సాయంత్రం తుఫాన్ తీరం దాటే అవకాశం ఉందన్నారు.

 29వ తేదీ వరకు తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు, బలమైన గాలులు వీచే చాన్స్ ఉందని హెచ్చరించారు. అత్యవసరమైతేనే ప్రయాణించాలని, లేకపోతే జర్నీ పోస్ట్​పోన్ చేసుకోవాలన్నారు. దక్షిణ మధ్య రైల్వే జీఎం సంజయ్ కుమార్ శ్రీవాస్తవ సోమవారం విజయవాడను సందర్శించారు. డీఆర్ఎం ఆఫీస్​లో అధికారులతో సమావేశమై పరిస్థితిని సమీక్షించారు. తుఫాన్​ను ఎదుర్కొనేందుకు తీసుకుంటున్న చర్యల గురించి అడిగి తెలుసుకున్నారు.