సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే(SECR) రాయ్‌పూర్ డివిజన్‌లో 1,113 ట్రేడ్ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో డిఆర్ఎం రాయ్‌పూర్ డివిజన్‌లో 844 ఖాళీలు ఉండగా.. వాగన్ రిపేర్ షాప్ రాయ్‌పూర్ డివిజన్‌లో 269 ఖాళీలు ఉన్నాయి. అర్హతలు, ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
ముఖ్య వివరాలు
మొత్తం ఖాళీలు: 1,113(ట్రేడ్ అప్రెంటిస్)
- డిఆర్ఎం రాయ్‌పూర్ డివిజన్: 844 ఖాళీలు
- వాగన్ రిపేర్ షాప్ రాయ్‌పూర్ డివిజన్: 269 ఖాళీలు
విద్యార్హతలు: అభ్యర్థులు 10+2 విధానంలో 10వ తరగతి పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి లేదా దానికి సమానమైన పరీక్షల్లో 50 శాతం మార్కులు సాధించి ఉండాలి. అలాగే, గుర్తింపు పొందిన సంస్థ నుండి సంబంధిత ట్రేడ్‌లో I.T.I కోర్సులో ఉత్తీర్ణులై ఉండాలి
వయో పరిమితి: 02.04.నాటికి అభ్యర్థుల వయస్సు 15 నుండి 24 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టి/ఓబీసీ. ఎక్స్ సర్వీస్ మెన్/పిడబ్ల్యూడి అభ్యర్థులకు వయో సడలింపు కలదు.
ఎంపిక విధానం: మెట్రిక్యులేషన్(10th), ITI పరీక్షలో సాధించిన మార్కుల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. ధ్రువపత్రాల వెరిఫికేషన్ సమయంలో మెడికల్ సర్టిఫికెట్ సమర్పించాల్సి ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులు ఏడాది పాటు అప్రెంటిస్ గా పని చేయాల్సి ఉంటుంది. రైల్వే బోర్డు నిర్ణయం ఆధారంగా స్టైపండ్ చెల్లిస్తారు.
దరఖాస్తుల ప్రారంభ తేదీ: 02.02 2024
దరఖాస్తులకు చివరి తేదీ: 01. 05. 2024
అధికారిక వెబ్ సైట్: https://secr.indianrailways.gov.in/
అభ్యర్థులు ఏవేని సందేహాలుంటే 7024149242 ఫోన్ నెంబర్ ను సంప్రదించి నివృత్తి చేసుకోగలరు.